యాప్నగరం

ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..

సమ్మర్‌లో కూరగాయలు, పండ్లు త్వరగా వాడిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 29 May 2023, 2:06 pm
సాధారణంగా చాలా మంది ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలు పెడుతుంటారు. ఎందుకంటే ఫ్రిజ్‌లో వీటిని పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కానీ, కొన్నిసార్లు పండ్లు, కూరగాయల్ని ఫ్రిజ్‌లో పెట్టినా పాడవుతుంటాయి. దీనికి కారణాలు ఏంటి. ఎందుకిలా త్వరగా పాడవుతాయి. మరి వీటిని ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
Samayam Telugu what is the best way to store fruits and vegetables fresh longer in the fridge
ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..


​అన్నింటిని ఒకేదగ్గర వద్దు..

కూరగాయలు, పండ్లలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. వీటిని అన్నింటిని ఒకేదగ్గర పెడుతుంటారు చాలా మంది. దీంతో కొన్ని కూరగాయలు, పండ్లు ఇథలీన్‌ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో అవి త్వరగా కుళ్ళిపోతాయి. అటువంటి కూరగాయలు, పండ్లని ఎలా స్టోర్ చేయాలో తెలుసుకోండి.

క్యాబేజీ..

క్యాబేజీ కూడా తాజాగా ఉండాలంటే స్వచ్చమైన గాలి అవసరం. అందుకే, యాపిల్స్, పుచ్చకాయలు, కివీస్ వంటి పండ్లతో వీటిని కలిపి పెట్టొద్దు. ఇవన్నీ కూడా ఇథలీన్‌ని రిలీజ్ చేసే పండ్లు. కాబట్టి, వీటికి దూరంగా ఉంచి స్టోర్ చేయడం అవసరం.

సోరకాయతో వద్దు..

సోరకాయ, పొట్లకాయ వంటి కూరగాయల్ని యాపిల్, ద్రాక్ష, అంజీర్ వంటి పండ్లతో కలిపి ఒకే దగ్గర స్టోర్ చేయొద్దు. ఎందుకంటే ఇవి కూడా ఇథిలీన్‌ని రిలీజ్ చేస్తాయి. దీంతో త్వరగా పాడవుతాయి.
Also Read : Onions storing : ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

బ్రకోలీతో ఫ్రూట్స్ వద్దు..

బ్రకోలీ‌కి ఇథలీన్ పడదు. కాబట్టి.. మీరు దీనిని ఆపిల్, అత్తి, ద్రాక్ష పండ్ల వంటి ఇథిలీన్ ఉత్పత్తి చేసే పండ్లతో బ్రకోలీని పెడితే అది త్వరగా పాడవుతుంది. అందుకే వాటిని ఈ పండ్లతో కలిపి పెట్టొద్దు..

ఆకుకూరలతో ఇవి వద్దు..

ఆకు కూరలు తాజాగా ఉండాలంటే వాటిని సెపరేట్‌గా ప్యాక్ చేసి పెట్టాలి. వీటికి దగ్గర్లో పుచ్చకాయ, ద్రాక్ష, యాపిల్స్ వంటి ఇథలీన్ రిలీజ్ చేసే పండ్లతో కలిపి పెట్టొద్దు. దీని వల్ల ఆకుకూరలు త్వరగా పాడవుతాయి. అందుకే వీటికి సెపరేట్‌గా పెట్టండి.
Also Read : ఇంటి గోడలపై మచ్చలు పడ్డాయా.. ఇలా క్లీన్ చేయండి..

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.