యాప్నగరం

ఆముదాన్ని ఇలా తీసుకుంటే మలబద్ధకం దూరం..

మలబద్ధకం ఉంటే ఏ పని తోచదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఆముదాన్ని ఎలా వాడాలో తెలుసుకోండి.

Authored byరావుల అమల | Samayam Telugu 14 May 2024, 9:43 am
నేటి కాలంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య. చాలా కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వల్ల చాలా మంది సమస్యని బయటికి చెప్పుకోలేరు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్న, పెద్దవారిలో కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి కారణాలు ఏంటి? ఆముదంతో ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసుకోండి.
Samayam Telugu how to use castor oil constipation relief
ఆముదాన్ని ఇలా తీసుకుంటే మలబద్ధకం దూరం..


కారణాలు..

మలబద్ధకానికి చాలా కారణాలు ఉన్నాయి.

డైట్ ఫాలో అవ్వకపోవడం
తగినంత నీరు తాగకపోవడం
పోషకాల లోపం
ఒత్తిడి.

నీరు తాకపోయినా , హైడ్రేషన్ తక్కువగా ఉన్నా, పీచుపదార్థాలు తీసుకోకపోయినా ఈ సమస్య వస్తుంది. వర్కౌట్ చేయకపోవడం మరో కారణం. ఈ సమస్య వస్తే మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

తగ్గేందుకు..

మంచి పోషకాహారం తీసుకోవాలి. వర్కౌట్స్ చేయాలి. ప్రోబయోటిక్స్, మెగ్నీషియం, ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. పండ్లు, టమాటలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆకుకూరలు, పెరుగు వంటివి తసీుకోవాలి. ఈ సమస్య ఉన్నవారు చాక్లెట్స్ మానేయాలి.

ఆకుకూరలు, బీన్స్, నట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హోల్ గ్రెయిన్స్, చేపలు, టర్కీ, తేనె, ఫిగ్స్, బాదం, అవిసెలు, అవకాడో, ఆకుకూరలు తినాలి. ఎండుద్రాక్ష నీరు, క్యారెట్ రసం, పైనాపిల్ రసం తీసుకోవచ్చు.

వీటిని తీసుకోవద్దు..

చాక్లెట్స్
ఫ్రై చేసిన ఫుడ్స్ తినొద్దు
కొవ్వు ఎక్కువగా ఉన్న ఫుడ్స్
ప్రాసెస్డ్ ఫుడ్స్
Also Read : Home Remedies: తేనెని ఇలా రాస్తే కాలిన గాయాలు, మచ్చలు తగ్గిపోతాయట..

ఈ పండ్లు తింటే మలబద్ధకం తగ్గుతుంది.

ఆముదం..

ఆముదం తీసుకోవడం వల్ల మలబద్ధకానికి చెక్ పెట్టొచ్చు. కాబట్టి, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని ఈ నూనెని తీసుకుంటే సమస్య తగ్గుతుంది. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది. ఆముదంలో రిసిలోనిక్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగ్గా చేసి పోషకాలను గ్రహించేందుకు హెల్ప్ చేస్తుంది.

ఎలా వాడాలి..

నాభి చుట్టూ పొత్తికడుపుపై రాయడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఆముదం కండరాల సంకోచాన్ని పెంచి ప్రేగు కదలికల్ని ఈజీగా చేస్తుంది.

నిమ్మరసం..

ఓ కప్పు ఆరెంజ్ జ్యూస్‌లో ఆముదం, కొద్దిగా నిమ్మరసం కలపండి. దీనిని రెగ్యులర్‌గా తాగండి. ఈ మిశ్రమంలోని ఫైబర్ ప్రేగు కదలికల్ని ఈజీ చేస్తుంది. నిమ్మరసం, ఆముదం రెండింటి కలయిక కూడా సమస్యని తగ్గిస్తుంది. ఓ కప్పు నిమ్మరసంలో ఓ టేబుల్ స్పూన్ ఆముదం వేసి కలపాలి. నిమ్మలోని ఆమ్లగుణాలు ప్రేగుకదలికల్ని ఈజీగా చేస్తాయి.
Also Read : కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..

ఆముదం..

ఆముదం తీసుకోవడం వల్ల మలబద్ధకానికి చెక్ పెట్టొచ్చు. కాబట్టి, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని ఈ నూనెని తీసుకుంటే సమస్య తగ్గుతుంది. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది. ఆముదంలో రిసిలోనిక్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగ్గా చేసి పోషకాలను గ్రహించేందుకు హెల్ప్ చేస్తుంది.

ఎలా వాడాలి..

నాభి చుట్టూ పొత్తికడుపుపై రాయడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఆముదం కండరాల సంకోచాన్ని పెంచి ప్రేగు కదలికల్ని ఈజీగా చేస్తుంది.

పాలు, ఆముదం..

ఆముదం మలబద్ధకాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఓ కప్పు పాలలో టేబుల్ స్పూన్ ఆముదం కలపండి. దీనిని కలిపి తాగండి. ఇవన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిష్కారాలు. దీనిని గర్భిణీలు, వాంతులు, రక్తస్రావం, అలర్జీలతో బాధపడేవారు తీసుకోవద్దు.
​Read More : Home remedies News and Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.