యాప్నగరం

చేతులపై మెహందీ త్వరగా పోవాలంటే ఇలా చేయండి..

మెహందీ పెట్టుకున్నప్పుడు బానే ఉంటుంది. రాను రాను అది వెలసిపోయినట్లు మరకల్లా కనిపిస్తుంది. ఇది చూడ్డానికి అంతగా బాగోదు. అంతా త్వరగా ఇది చేతుల నుంచి పోదు కూడా. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మెహందీ మరకలు త్వరగా పోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Samayam Telugu 20 Dec 2019, 6:58 pm
మెహందీ పెట్టుకున్నప్పుడు బానే ఉంటుంది. రాను రాను అది వెలసిపోయినట్లు మరకల్లా కనిపిస్తుంది. ఇది చూడ్డానికి అంతగా బాగోదు. అంతా త్వరగా ఇది చేతుల నుంచి పోదు కూడా. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మెహందీ మరకలు త్వరగా పోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Samayam Telugu natural and effective ways to remove mehandi from your hands and feet know here
చేతులపై మెహందీ త్వరగా పోవాలంటే ఇలా చేయండి..


​టూత్ పేస్ట్ కూడా..


టూత్ ‌పేస్ట్‌లోనూ అద్భుత గుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల చాలా వరకూ మరకలు పోతాయి. పేస్ట్‌లో మెహందీ రంగును తొలగించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మెహందీని పోగొట్టుకునేందుకు పేస్ట్‌ని తీసుకుని మెహందిపై పొరలా అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయండి. ఇలా చేస్తే ఆ మరకలు పోతాయి. కాబట్టిని పేస్ట్‌ని కూడా అప్లై చేసి మరకలను పోగొట్టుకోవచ్చు.

​యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్..


యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్‌లోనూ మెహందీని పోగొట్టే లక్షణాలు ఉన్నాయి. వీటని చేతులకి రాసి 8 నుంచి 10 నిమిషాలు అయిన తర్వాత చేతులను కడిగేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ మరకలు పోతాయి. సోప్స్ బదులు లోషన్స్ కూడా బాగానే పనిచేస్తాయి. కాబట్టి మెహందీ మరకలను పోగొట్టుకునేందుకు వాటిని కూడా వాడొచ్చు.

​ఉప్పు నీరు..


ఉప్పు కూడా మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల చాలా వరకూ మెహందీ మరకలు పోతాయి. ఇందు కోసం ఏం చేయాలంటే.. ఒక బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకుని అందులో ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ నీటిలో చేతులు మునిగేలా ఉంచండి. 20 నిమిషాల తర్వాత బయటకి తీయండి. ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ పోతుంది. కాళ్లకి ఉన్న మరకలు కూడా ఇలా చేయడం వల్ల పోతాయి. దీనికోసం ఓ టబ్‌లో ఉప్పునీటిని పోసి అందులో కాళ్లను పెట్టి ఆ తర్వాత రాయండి. ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ మరకలు పోతాయి.

​వంట సోడా..


వంట సోడాలోనూ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. వంట సోడాను వాడడం వల్ల మెహందీ మరకలు ఈజీగా పోతాయి. అందుకోసం వంటసోడాలో నిమ్మరసం కలిపి మెహందీపై రాయాలి. ఇది ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రాయడం వల్ల చాలా వరకూ ఉపయోగం ఉంటుంది.

​నిమ్మతో…


నిమ్మలో ఎక్కువగా బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల ఎలాంటి మరకలు అయినా పోతాయి. కాబట్టి దీనిని ఉపయోగించి మెహందీ మరకలను ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఇందుకోసం.. నిమ్మ చెక్కని తీసుకుని చేతులు, మెహందీ ఎక్కడ ఉందో ఓ చోట్ల రాసి బాగా రుద్దాలి. ఆ తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల త్వరగా మెహందీ మరకలు పోతాయి.

​మాయిశ్చరైజర్ తప్పనిసరి..


ఇలా గోరింటాకు మరకలు పోగొట్టుకోవడానికి చిట్కాలు వాడిన తర్వాత చేతులకు మాయిశ్చరైజింగ్ రాయాలి. ఇలా చేయడం వల్ల చేతులు పొడిబారకుండా ఉంటాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల చాలా వరకూ మెహందీ మరకలు పోతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.