యాప్నగరం

ఈ డ్రింక్స్ తాగితే లివర్ డీటాక్స్ అయి సమస్యలు దూరమవుతాయట..

బాడీలో ట్యాక్సిన్స్ పేరుకుపోతే అవి కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. దానిని డీటాక్స్ చేయడానికి కొన్ని డ్రింక్స్ తాగండి.

Authored byరావుల అమల | Samayam Telugu 19 Apr 2024, 3:21 pm
బాడీలో పొట్టభాగంలో ఎడమవైపు నొప్పిగా ఉంటే అది లివర్ సమస్య కావొచ్చు. లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే కడుపు నొప్పిగా ఉంటుంది. లివర్ డీటాక్స్ అయ్యేందుకు కొన్ని డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి. లివర్ డిటాక్స్ అయవడానికి కొన్ని డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి. వీటిని తాగడం వల్ల లివర్ డీటాక్స్ అవుతాయి. అలాంటి డ్రింక్స్ గురించి తెలుసుకోండి.
Samayam Telugu natural drinks to detox liver
ఈ డ్రింక్స్ తాగితే లివర్ డీటాక్స్ అయి సమస్యలు దూరమవుతాయట..


నిమ్మరసం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగండి. ఇందులోని విటమిన్ సి లివర్ డీటాక్స్ ఎంజైమ్స్‌ని ప్రేరేపించి పిత్త ఉత్పత్తికి సాయపడుతుంది. పిత్తం కాలేయంలోని కొవ్వుని విచ్ఛిన్నం చేయడానికి హెల్ప్ చేస్తుంది.

లివర్ డీటాక్స్ అయ్యేందుకు ఏం తీసుకోవాలంటే..

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి ఓ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది లివర్ దెబ్బతినకుండా, డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందుకోసం రోజూ ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే లివర్ హెల్త్‌కి మంచిది.
Also Read : మిర్చీ కట్ చేశాక చేతులు మంట మండకుండా ఉండాలంటే ఇలా చేయండి..

డాండెలైన్ టీ..

ఈ టీలో కూడా లివర్ డిటాక్సీఫైయింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి పిత్త ఉత్పత్తిని ప్రేరేపించి లివర్ పనితీరుకి సాయపడుతుంది. మీరు డాండెలైన్ రూట్ టీని వేడినీటిలో మరిగించి రెగ్యులర్‌గా తీసుకుంటే మీరు లివర్‌ని కాపాడుకోవచ్చు.

బీట్‌రూట్ జ్యూస్..

బీట్‌రూట్‌లో ఎక్కువగా బీటాలైన్స్ ఉన్నాయి. ఇవి కాలేయ పనితీరుకి మద్దతిచ్చే యాంటీ ఆక్సిడెంట్. ఈ పాలని తాగితే లివర్ డీటాక్స్ అవుతుంది. అందుకే, తాజా బీట్‌రూట్ జ్యూస్ తాగితే లివర్ హెల్దీగా ఉంటుంది.
Also Read : పడుకునే ముందు ఈ పాలు తాగితే నిద్ర సమస్యలతో పాటు ఇవన్నీ దూరం..

పసుపు పాలు..

పసుపులో కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. పాలలో పసుపు వేసుకుంటే అవి మంచి డీటాక్సీఫైయర్ డ్రింక్‌లా పనిచేస్తాయి. అందుకోసం పాలలో కొద్దిగా పసుపు, నల్ల మిరియాల పొడి వేయండి. ఈ పాలని తీసుకుంటే అవి లివర్ హెల్త్‌ని కాపాడుతుంది.
​Read More : Home remedies News and Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.