యాప్నగరం

Idli batter Tips: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. ఇడ్లీ పిండి ఫ్రిజ్‌లో పెట్టకపోయినా పులవదు..!

Idli batter Tips: వేసవిలో ఇడ్లీ పిండి త్వరగా పులిసిపోతూ ఉంటుంది. కొన్ని టిప్స్‌ ఫాలో అయితే.. ఫ్రిజ్‌లో పెట్టకపోయినా పిండి పులవకుండా ఉంటుంది.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 19 May 2023, 4:44 pm
Idli batter Tips: బ్రేక్‌ఫాస్ట్‌ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీనే. వేడివేడి ఇడ్లీలు తిన్నప్పుడు ఉండే మజానే వేరు. ఆరోగ్యానికి మంచిదనీ తేలికగా అవుతుందనీ అమ్మలంతా వారంలో మూడు నాలుగు రోజులు ఇడ్లీనే చేస్తూ ఉంటారు. అయితే వేసవి కాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులుస్తుంది. ఈ పిండితో తయారు చేసిన ఇడ్లీలు.. తిన్నడానికి అంతగా రుచిగా ఉండవు. ఈ సీజన్‌లో ఫ్రిజ్‌లో పెట్టినా పిండి పులుస్తూ ఉంటుంది. దోశల పిండి పరిస్థితి కూడా ఇదే. కొన్ని టిప్స్‌ ఫాలో అయితే.. ఇడ్లీ పిండి, దోశ బయట పెట్టినా పులువకుండా ఉంటాయి.
Samayam Telugu Idli



  • బియ్యాన్ని కానీ పప్పులు గాని మూడు నాలుగు గంటలు మాత్రమే నానబెట్టాలి. కొంతమంది రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిండి రుబ్బుతారు. ఇలా చేయడం వల్ల కూడా త్వరగా పులిసిపోయే అవకాశం ఉంటుంది.
  • ఇడ్లీ, దోశల పిండిని మిక్స్‌ చేసేప్పుడు.. గరిటతోనే కలుపుకోవాలి. ఇడ్లీ పిండిని చేతితో కలిపితో.. శరీర వేడి కారణంగా పిండి త్వరగా పులిసిపోయే అవకాశం ఉంది.
  • మీరు పప్పు పట్టేప్పుడు గ్రైండర్‌ను శుభ్రంగా కడగాలి. గ్రైండర్లో మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా రుబ్బుకోవాలి. కలిపి మెత్తగా రుబ్బకూడదు.
  • ఇడ్లీలు పులిసిన వాసన రాకుండా రుచిగా ఉండాలంటే.. పిండి రుబ్బేటప్పుడు మూడు చెంచాల నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి.
  • ఇడ్లీ, దోశ బ్యాటర్‌లో తమలపాకులు వేసుకుంటే.. పిండి త్వరగా పులవకుండా ఉంటుంది.
  • పిండిని పెద్ద పాత్రలో నీళ్లతో పోసి దాని పైన పిండి పాత్రను ఉంచితే అది త్వరగా పులియదు.
  • ఇడ్లీ పిండిపై అరటి ఆకు ముక్కలు వేసి మూత పెడితే ఆ పిండి రెండు రోజులపాటు కూడా అలాగే ఉంటుంది.
  • ఇడ్లీ పిండి ఎక్కువ రోజులు పిలియకుండా ఉండాలంటే 100 గ్రాముల ఇడ్లీ పిండికి 1 మి.లీ ఆవాలనూనె కలిపండి. ఇలా చేస్తే.. 4 పిండి బయట ఉంచినా పులియదు. ఫ్రిజ్‌లో ఉంచితే 30 రోజుల వరకు చెడిపోదు. ఆవాల నూనె ఇడ్లీ పిండిలో ఉత్పత్తి అయ్యే చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.