యాప్నగరం

oil massage: డెలివరీ తర్వాత.. ఈ నూనెతో మసాజ్‌ చేస్తే నొప్పులు తగ్గుతాయ్‌..!

డెలివరీ తర్వాత, శరీరానికి బలాన్ని ఇవ్వడానికి, కండరాలలోని బలహీనతను తొలగించడానికి బాడీ మసాజ్ చేస్తే మంచిది. శరీర అలసట నుంచి బయటపడటానికి బాడీ మసాజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌‌‌. ఈ సమయంలో కొన్ని ఆయిల్స్‌తో మాసాజ్‌ చేస్తే.. నొప్పులు త్వరగా దూరమవుతాయి. ఆ నూనెలు ఏమిటో చూసేయండి.

Edited byరాజీవ్ శరణ్య | Samayam Telugu 25 Jul 2022, 7:09 pm
డెలివరీ కారణంగా మహిళల శరీరం బాగా అలసిపోతుంది. శరీరం బలహీన పడుతుంది. కాన్పు తర్వాత కాళ్ళలో, తొడలలో, చేతులు, మెడ, వీపు వంటివి నొప్పులు పెడతాయి. డెలివరీ తర్వాత, శరీరానికి బలాన్ని ఇవ్వడానికి, కండరాలలోని బలహీనతను తొలగించడానికి బాడీ మసాజ్ చేస్తే మంచిది. శరీర అలసట నుంచి బయటపడటానికి బాడీ మసాజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌‌‌. బాడీ మసాజ్‌ నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. డెలివరీ తర్వాత బాడీ మసాజ్‌ శరీరానికి మంచిదని మహిళలందరికీ తెలుసు. ఈ సమయంలో కొన్ని ఆయిల్స్‌తో మాసాజ్‌ చేస్తే.. నొప్పులు త్వరగా దూరమవుతాయి. ఆ నూనెలు ఏమిటో చూసేయండి.
Samayam Telugu massage


ఆవ నూనె..

డెలివరీ తర్వతా, ఆవ నూనె మసాజ్‌ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనె ప్రభావం కారణంగా శరీరానికి వేడి చేస్తుంది. దీని వల్ల శరీరం త్వరగా నయమవుతుంది. ఇది బాలింతలకు మంచి చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గించడానికి, రక్త ప్రసరణకు ఆవనూనె మంచిదని నిపుణులు అంటున్నారు.
ఆవనూనెలో సెలరీ లేదా వెల్లుల్లి వేసి వేడి చేస్తే దాని ప్రభావం మరింత పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, సాధారణ డెలివరీ అయిన మహిళలకు గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నూనె..

డెలివరీ తర్వాత కొబ్బరినూనెతో మసాజ్‌‌‌‌ మంచిది. తలకు మసాజ్‌ కోసమే కాకుండా, బాడీ మాసాజ్‌కు కొబ్బరినూనె వాడొచ్చు. కొబ్బరి నూనె శరీరానికి ఉపశమనం, హైడ్రేటింగ్‌ ప్రభావాన్ని ఇస్తుంది.
నువ్వుల నూనె..

ఆయుర్వేదంలో నువ్వుల నూనెను ఒత్తిడి, బీపీ తగ్గించడానికి ఉపయోగిస్తారు. శరీరాన్ని చల్లబరిచి ఒత్తిడిని తగ్గించేందుకు నువ్వుల నూనె సహాయపడుతుంది. డెలివరీ తర్వతా మసాజ్‌కు నువ్వుల నూనె బెస్ట్‌ ఆప్షన్‌.
బాదం నూనె..

బాదం నూనెను శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఈ నూనెతో మసాజ్‌ చేస్తే కండరాల నొప్పి, వాపు, దురద తగ్గుతుంది, ఛాయ మెరుగుపడుతుంది. బాదం నూనెతో మాసాజ్‌‌‌ చేస్తే.. స్ట్రెచ్‌ మార్క్స్‌ కూడా తగ్గుతాయి.
ఆలివ్‌ ఆయిల్‌ మసాజ్‌..

డెలివరీ తర్వాత ఆలివ్‌తో మసాజ్‌ చేస్తే మంచిది. డెలివరీ తర్వత వచ్చే నొప్పులను తగ్గించడంలో ఆలివ్‌ ఆయిల్‌ సహాయపడుతుంది. ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే కండరాల దృఢత్వం తగ్గుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.