యాప్నగరం

పెల్విక్ టీబీ అంటే ఏమిటీ? సంతాన సమస్యలకు ఇదే కారణమా?

ఇండియా జర్నల్ ఆఫ్ ట్యుబర్‌క్యులోసిస్ నివేదిక ప్రకారం.. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే ఉంటుందని, దేశంలో సంతాన సాఫల్య కేంద్రాలకు వస్తున్న 5 నుంచి 13 శాతం మహిళలు పెల్విక్ టీబీ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.

Samayam Telugu 13 Mar 2021, 10:47 pm
రోజుల్లో ఎన్నో జంటలు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐవీఎఫ్ తదితర విధానాల ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. చాలామందిలో సంతానలేమికి గల సమస్యకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే, కొందరిలో సంతాన సమస్యలకు పెల్విక్ ట్యూబేర్కలోసిస్ (కటి క్షయ) కూడా ప్రధాన కారణమని వైద్యులు తెలుపుతున్నారు. ఇది సాధారణ పరీక్షల్లో బయటపడదని, కేవలం హిస్టెరోస్కోపీ లేదా గర్భాశయ పరిశీలన, బయోప్సీ ద్వారా మాత్రమే దీన్ని గుర్తించగలమన్నారు. దీన్నే జననేంద్రియ క్షయ అని కూడా అంటారు.
Samayam Telugu Pelvic Tuberculosis


ఇండియా జర్నల్ ఆఫ్ ట్యుబర్‌క్యులోసిస్ నివేదిక ప్రకారం.. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే ఉంటుందని, దేశంలో సంతాన సాఫల్య కేంద్రాలకు వస్తున్న 5 నుంచి 13 శాతం మహిళలు పెల్విక్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. వైద్యులు గత రెండేళ్ల నుంచే ఈ టీబీ సమస్యపై దృష్టిపెట్టారు. ఈ టీవీ వల్ల సంతాన లేమి సమస్యలు ఏర్పడతాయి. ఇది శరీరంలోని ఏ అవయవానికైనా సోకే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. వ్యాధి లక్షణాలను గుర్తించడం సవాల్‌తో కూడుకున్నదని అంటున్నారు. ఈ టీబీని ప్రారంభ దశలో కనిపెట్టడం కూడా కష్టమేనని తెలుపుతున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగలేనట్లయితే లాప్రోస్కొపీ, జననేంద్రియాల స్కానింగ్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రారంభం దశలోనే ఈ టీబీని నిర్ధరించకపోతే పునురుత్పాదక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల సహజ లేదా కృత్రిమ‌ పద్ధతిలో సంతానోత్పతి జరగడం కూడా కష్టమవుతుందని తెలుపుతున్నారు. చూశారుగా.. ఎన్నేళ్లు గడిచినా సంతానం కలగకపోతే తప్పకుండా ఈ టీబీని గుర్తించే వైద్య పరీక్షలు చేయించుకోండి.

గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్యుల సూచనలతో మీ అవగాహన నిమిత్తం ఈ కథనం అందించాం. మీకు ఎలాంటి సందేహాలున్నా వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోగలరు. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎలాంటి బాధ్యత వహించదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.