యాప్నగరం

Late Pregnancy : లేటు వయసులో ప్రెగ్నెన్సీ వస్తే ఈ సమస్యలు తప్పవు..

సాధారణంగా మాతృత్వం అనేది ఓ గొప్ప వరం. ఇందుకోసం ప్రతి తల్లి ఎదురుచూస్తోంది. తాను ఎప్పుడెప్పుడూ పిల్లల్ని కనాలా అంటూ ప్రణాళికలు చేసుకుంటుంది. నేటి కాలంలో కెరీర్, విద్య, స్థిరపడడం ఇలా ప్రతిదీ ప్లానింగ్‌పైనే ఆధారపడి ఉంది. ఆడపిల్లలు అన్ని సెటిల్ అయ్యాకే మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. దీంతో లేట్‌గా పెళ్ళి.. అంతే లేటుగా పిల్లల్ని కనడం. మరి ఇలా లేట్‌గా చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అంటే.. చాలానే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

Authored byరావుల అమల | Samayam Telugu 24 May 2022, 9:15 pm

ప్రధానాంశాలు:

  • లేట్ ప్రెగ్రెన్సీతో కొన్ని ఆరోగ్య సమస్యలు
  • జాగ్రత్త అవసరం అంటున్న నిపుణులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu లేటు వయసులో ప్రెగ్నెన్సీ వస్తే ఈ సమస్యలు తప్పవు
ఇంతకుముందు కాలంలో అమ్మాయిని ఎప్పుడెప్పుడూ ఓ అయ్య చేతిలో పెడదామా అంటూ తల్లిదండ్రులు ఆలోచించేవారు. దీంతో వారు వయసుకి వచ్చింది మొదలు సంబంధాలు చూడడం, పెళ్ళి అంటూ ప్లానింగ్స్ చేయడం చేస్తుంటారు. కానీ, నేడు ఇవన్నీ లేవు. ముందుగా భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని కెరీర్‌లో సెటిల్ అయ్యాకే మ్యారేజ్, పిల్లలు, ఫ్యామిలీ అంటూ ప్లానింగ్స్ వేస్తున్నారు. ఇది నిజమే అయినప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లేటు వయసులో పిల్లల్ని కనడం వల్ల మహిళలకి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని తేలింది. వాటి గురించి తెలుసుకుందాం..
అవకాశాలు తగ్గడం..
Hair care : వీటిని తింటే జుట్టు బాగా పెరుగుతుందట
అసలు ముఖ్యానికి ఈ వయసులో ప్రెగ్నెన్సీ రావడం కాస్తా కష్టం. వయసు పెరిగాక పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దీంతో సంతాన కలిగే అవకాశాలు కూడా తగ్గుతాయి. అయితే, వీటిని అధిగమించేందుకు కృత్రిమ పద్ధతులు ఆశ్రయిస్తారు. అయితే, కొన్ని సార్లు ఇవి కూడా వికటిస్తాయి. ఈ క్రమంలోనే ఓవెరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే సమస్య ఎదురవుతుంది. సంతానం కలిగేందుకు అండాశయాలను ఉత్తేజపరచడానికి వాడే మందులు ఈ సమస్య వస్తుంది. దీని వల్ల అండాశయాలు వాచి పొట్టలోకి నీరు చేరుతుంది. ఇది 30 శాతం మహిళల్లో పెద్దగా సమస్యగా లేకపోయినా 70 శాతం స్త్రీలలో సమస్యగా మారుతుంది.


35 దాటాక కష్టం..


పిల్లల్ని కనేందుకు 25 నుంచి 35 లోపు మంచి సమయం. ఇక ఈ వయసు దాటాక మహిళలు గర్భం దాల్చితే అది తల్లి, బిడ్డా ఇద్దరి ఆరోగ్యానకి హానే అనే చెబుతున్నారు నిపుణులు. గర్భం దాల్చే ముందు, గర్భ సమయం, డెలివరీ ఇలా మూడు విభాగాలుగా విడదీస్తే మూడింటిని కూడా తట్టుకోవడమే కత్తిమీద సామే అని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఒంట్లో బలం తగ్గుతుందని, దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. థైరాయిడ్ వంటి సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

పుట్టి పిల్లలకి లోపాలు..

అదే విధంగా లేటు వయసులో ప్రెగ్నెన్సీ వస్తే క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. దీంతో పుట్టే పిల్లలకి డౌన్ సిండ్రోమ్ సమస్య వస్తుంది. నలభై ఏళ్ళు దాటిన 10 మంది స్త్రీలలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ బిడ్డ పుడుతుంది.
National Brother's Day : అన్నైనా, తమ్ముడైనా వీటిని భరించాల్సిందే..
బరువు పెరగడం..

సాధారణంగా ప్రెగ్నెన్సీలోనే బరువు పెరగడం ఖాయం. ఇక ఇది వయసు పెరిగిన వారికి ఇది ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్, బీపి పెరగడం కూడా ఎక్కువ అవుతుంది. 40 సంవత్సరాలున్న మహిళల్లో ఇది 26 శాతం మందికి హై బీపి వస్తుంది. దీంతో ఫిట్స్, రక్త స్రావం, అబార్షన్ అవుతుంది.

కష్టంగా డెలివరీ..


వయసు పెరిగిన వారికి కాన్పు కూడా కష్టమవుతోంది. సిజేరియన్ ద్వారా డెలివరీ చేయాల్సి వస్తుంది. దీంతో రక్తస్రావం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ 9 నెలలు కూడా మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఆ విషయాన్ని కచ్చితంగా గమనించాల్సి ఉంటుంది.

అయితే అందరిలోనూ ఇలానే జరగాలని ఏం లేదు. కానీ, వయసు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. అయినప్పటికీ ప్రతి విషయంలోనూ వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. ఎప్పటికప్పుడు చెకప్, వారి సలహాలు, సూచనలు తీసుకోవడంతో చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.
Onions for Health : ఉల్లిపాయని ఇలా తింటే కిడ్నీల్లోని రాళ్ళు కరిగిపోతాయట..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.