యాప్నగరం

Constipation During Pregnancy: ప్రెగ్నెన్సీ టైమ్‌లో మలబద్ధకం తగ్గాలంటే.. ఈ ఆహారం తీసుకోండి..!

Constipation During Pregnancy:   ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య.   ప్రెగ్నెన్సీ టైమ్‌ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి.. మందులు వేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుంది, దీనిని నివారించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 7 Feb 2023, 2:29 pm
Constipation During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య. ప్రతి నలుగురు గర్భిణీ స్త్రీలలో దాదాపు ముగ్గురు మహిళలు మలబద్ధకంతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే.. హెమోరాయిడ్స్‌కు దారితీసే ప్రమాదం ఉంది. మలబద్దకం వలన పొత్తికడుపులో నొప్పి, ప్రేగుల కదలికలు నెమ్మదించడం, విసర్జకాలు గట్టిపడటం వంటివి జరుగుతాయి. గర్భధారణ మొదటి నెల నుంచి.. ప్రసవం వరకు ఎప్పుడైనా.. మలబద్ధకం ఇబ్బంది పెట్టవచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్‌ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి.. మందులు వేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుంది, దీనిని నివారించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu what are the causes behind constipation during pregnancy and how to get rid of it
Constipation During Pregnancy: ప్రెగ్నెన్సీ టైమ్‌లో మలబద్ధకం తగ్గాలంటే.. ఈ ఆహారం తీసుకోండి..!


మలబద్ధకం ఎందుకు వస్తుంది..?

  • దిగులు, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం శరీరంలోని అన్ని అసౌకర్యాలకు సాధారణమైన కారణాలు. శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల కూడా పేగు కండరాలను సడలించి గర్భాశయాన్ని విస్తరించి పేగులలో ఒత్తిడి కలిగిస్తుంది. దీనికారణంగా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది.
  • గర్భం పెరుగదల కూడా.. మలబద్ధకానికి కారణం అవుతుంది. ఇది శరీర కండరాలను సలడలిస్తుంది. గర్భాశయం నుంచి దిగువ మూత్రనాళాన్ని కుదింస్తుంది. ఇది మలబద్ధకానికి కారణం అవుతుంది.
  • గర్భీణులలో మలబద్ధకానికి మరొక కారణం డీహైడ్రేషన్. ప్రెగ్నెన్సీ సమయంలో తాగిన నీటి కంటే కూడా.. కోల్పోయే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. అందువల్ల ఈ సమయంలో ఎక్కువగా ద్రవ పదార్థలు తీసుకోవాలి. సరిపడా నీరు తాగాలి.
  • గర్భధారణ సమయంలో ప్రొజెస్టిరోన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. తద్వారా మలబద్ధకానికి దారితీస్తుంది. కొంతమంది మహిళలలో ఐరన్ మాత్రలు మలబద్దకానికి కారణం కావచ్చు.

ఈ పండ్లు తినండి..

దానిమ్మ

దానిమ్మలో విటమిన్ K, కాల్షియం, ఫోలేట్, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో దానిమ్మ తీసుకుంటే.. శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దానిమ్మ జ్యూస్‌ కాగడం కంటే... గింజలు తినడం మేలు. దీనిలోని ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది.


రాస్ప్బెర్రీస్..
రాస్ప్బెర్రీ ఎరుపు రంగులో ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పండులో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు బలపేతం చేస్తుంది. (Image source - pixabay)

పియర్‌..

ఒక మీడియం సైజ్‌ పియర్‌లో 5.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో ఫోలేట్, . యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. (Image source - pixabay)

అరటిపండు

ఇందులో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. వికారం, వాంతులు నుంచి కూడా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. (Image source - pixabay)

జామకాయ..

దీనిలో విటమిన్‌ సీ, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ నుంచి రక్షిస్తుంది. గర్భిణులు రోజుకొక జామపండు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. (Image source - pixabay)

యాపిల్‌..

ఒక యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్‌ 4.4 గ్రాములు ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోజుకొక యాపిల్‌ తింటే.. మలబద్ధకం అదుపులో ఉంటుంది. మలవిసర్జన సమయంలో చికాకు ఉండదు. (Image source - pixabay)

డ్రైఫ్రూట్స్‌..

ఎండు ద్రాక్ష, అంజీర్, ఖర్జూరం, వాల్ నట్స్, బాదం, వాల్ నట్స్ శరీరానికి శక్తినిస్తాయి. అలాగే వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్‌ మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోజు డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి బిడ్డ ఎదుగుదలకు సహాయపడతాయి. (Image source - pexels)

ఎన్ని నీళ్లు తాగాలి..?

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు తాగడానికి ఇబ్బందిగా ఉన్నవారు నిమ్మరసం, స్ట్రాబెర్రీ ముక్కలు, దోసకాయ వంటిని నీళ్లులో వేసుకుంటే.. రుచి పెరుగుతుంది. (Image source - pixabay)

వ్యాయామం చేయండి..

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మలబద్ధకాన్ని నివారించవచ్చు. వాకింగ్‌, చిన్నపాటి వ్యాయామాలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఆహారం తీసుకోండి..

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. గర్భిణి స్త్రీలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు 25 నుంచి 30 గ్రాముల ఫైబర్‌ను ఆహారంలో తీసుకోవాలి. అందులో తాజా పండ్లు , సలాడ్లు, ఆకుకూరలు , బీన్స్ , బఠాణీలు, చపాతీలు మీ డైట్‌లో చేర్చుకోండి.


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.