యాప్నగరం

Birth control : పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏవి వాడితే మంచిదంటే..

Birth control : గర్బధారణను అత్యంత ప్రభావవంతంగా నిరోధించడం, మీ లైఫ్‌స్టైల్‌కి సరిపోయే ఉత్తమమైన గర్బనిరోధకం గురించి తెలుసుకోండి. మేల్ కండోమ్, గర్బనిరోధక మాత్రలు సాధారణంగా దేశంలో గర్బధారణను నిరోధించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని నిపుణులు చెబుతారు.

Produced byరావుల అమల | Samayam Telugu 26 Sep 2022, 2:07 pm
అయితే, జనన నియంత్రణ పద్దతుల్లో ఏది మంచిదో ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. మీకు పడింది.. అందరికి పడకపోవచ్చు. అయితే జనన నియంత్రణను ఎంచుకునే ముందు గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.. అవేంటంటే..
Samayam Telugu which is an effective from of birth control and how to chose it know here all
Birth control : పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏవి వాడితే మంచిదంటే..


​ఇవి చాలా ముఖ్యం..

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మీకు మంచి జనన నియంత్రణను ఎంచుకోవడంలో సహాయపడతాయి. దీంతో పాటు మరిన్ని మంచి పద్దతుల గురించి తెలుసుకోండి.

1. ధర ఎంత అనేది తెలుసుకోవడం.

2. గోప్యత ఎంత అనేది ముఖ్యం..

3. మీకోసం జాగ్రత్తలు తీసుకునే వారు ఉన్నారా..

4. మీరు లైంగికంగా సంక్రమించే వ్యాధులు(STD)ల నుండి రక్షించబడాలి.

5. గర్బధారణని నివారించడానికి మీరు ఎంత ప్రయత్నించాలి.

6. మీరు స్త్రీ అయితే, పీరియడ్స్‌పై పట్టింపు ఉందా..

Also Read : Lung Cancer : లంగ్ క్యాన్సర్ రాకుండా ఏం చేయాలంటే..

​పిల్స్..

పిల్స్ విషయానికొస్తే చాలా ఎంపికలు ఉననాయి. జనన నియంత్రణతో పాటు, పిల్ మీ కాలాలను నియంత్రిస్తుంది. తిమ్మిరిని తగ్గిస్తుంది. మెటిమలను కూడా క్లియర్ చేస్తుంది. సరిగ్గా ఉపయోగించినప్పుడు ఇది మంచి పద్దతని తెలుస్తుంది.

Also Read : Heart attack : మలబద్ధకం ఉంటే గుండెనొప్పి వచ్చే అవకాశం ఉందా..

​కండోమ్స్..

కండోమ్స్ జనన నియంత్రకు ప్రసిద్ది చెందినవి. ఇవి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను నిరోధించడంలో కూడా సహయపడతాయి. ఇది చాలా మంచి గర్భనిరోధకం. కండోమ్స్ రబ్బర్‌తో తయారు చేస్తారు. భాగస్వామి జననాంగాలు ప్రత్యక్షంగా తగలకుండా ఇవి కాపాడతాయి. ఇది ఇతర రకాల లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తాయి. దీనికి విరుద్ధంగా, గర్బధారను నివారించడంలో 85 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి కూడా చిరిగిపోతాయి. జాగ్రత్తగా చూడడం అవసరం.

​డయాఫ్రాగమ్

డయాఫ్రాగమ్ అనేది మీ గర్భాశయంలో ఉండే ఫోల్డేబుల్ కప్. సేమ్ మెనుస్ట్రువల్ కప్‌లానే ఉంటుంది. డయాఫ్రాగమ్‌లు కండోమ్స్ కావు. కాబట్టి అవి శృంగార సమస్యలను నిరోధించవు. కానీ, సరిగ్గా ఉపయోగిస్తే, గుడ్డులోకి స్పెర్మ్ చేరకుండా నిరోధిస్తాయి. గర్భావయ టోపీలలాగా పనిచేస్తాయి.

Also Read : Peanuts : షుగర్ ఉన్నవారు పల్లీలు తింటే మంచిదేనా..

​ఎమర్జెన్సీ పిల్స్..

చాలా మంది అసురక్షిత శృంగారం, కండోమ్ చిరిగిపోవడం తర్వాత ఎమర్జెన్సీ గర్బనిరోధకం యొక్క రూపంగా ప్లాన్ బిగా దీనిని చెప్పుకోవచ్చు. ఎలాంటి రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొన్న 72 గంటల లోపు అత్యవసరంగా ఈ గర్బనిరోధకాన్ని ఉపయోగించొచ్చు. ఎంత త్వరగా దీనిని ఉపయోగిస్తే అంత మంచిది. దీంతో పాటు అనేక ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. IUD, కాపర్ IUD మొదలైనవి. వీటి గురించి మీరు ముందుగా డాక్టర్‌ని కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి.

-Dr. Shobha Gupta, Medical Director, Mother's Lap IVF Centre, New Delhi

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu New

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.