యాప్నగరం

అరటి-మొక్కజొన్నతో టేస్టీ ఫింగర్స్

చికెన్‌తో నగ్గెట్స్ తిన్నారుగా... అలాగే వెజిటబుల్ నగ్గెట్స్ రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు.

TNN 26 Nov 2016, 7:59 pm
చికెన్‌తో ఫింగర్స్ తిన్నారుగా... అలాగే వెజిటబుల్ ఫింగర్స్ రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అమ్మో కష్టమేమో అనుకోకండి... పకోడీలు చేసినంత సులువు.
Samayam Telugu banana corn fingers recipe
అరటి-మొక్కజొన్నతో టేస్టీ ఫింగర్స్


కావాల్సిన పదార్థాలు
అరటికాయలు - 2, క్యారెట్ తరుగు - పావు కప్పు, మొక్కజొన్న గింజలు - ఒక కప్పు, కొత్తిమీర తరుగు - రెండు టీస్పూనులు, జీలకర్ర - అర టీస్పూను, ఎండుద్రాక్ష - ఒక టీ స్పూను, జీడిపప్పు - అయిదు, గరం మసాలా - పావు టీ స్పూను, పచ్చిమిర్చి - రెండు, నిమ్మరసం - అరటీస్పూను, పనీర్ ముక్కలు - ఒక కప్పు, కారం - చిటికెడు, చాట్ మసాలా - చిటికెడు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత


తయారుచేసే విధానం
అరటికాయల్ని, మొక్కజొన్న గింజల్ని ఉడికించాలి. బాగా ఉడికాక వాటిని ముద్ద చేయాలి. పెద్ద వెడల్పాటి పాత్రలో అరటి గుజ్జుని వేసి క్యారెట్ తరుగు, కొత్తి మీర తరుగు, జీలకర్ర, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి, నిమ్మరసం, తరిగిన పనీర్ ముక్కలు, కారం, చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ ముద్దని మొదట గుండ్రంగా చుట్టి... నగ్గెట్స్ లాగా చేసుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనెని వేసి వేడి చేయాలి. అందులో నగ్గెట్స్‌ని గోల్డ్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి. అరటి-మొక్కజొన్న టేస్టీ
ఫింగర్స్ సిద్ధం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.