యాప్నగరం

కర్ణాటక స్టైల్ సాంబార్.. ఎంతో టేస్టీ..

Samayam Telugu 22 Jul 2021, 4:09 pm
  • 40mTotal Time
  • 25mPrep Time
  • 215Calories
ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రెడిషనల్ కర్ణాటక స్టైల్ సాంబార్ ఇది. దీనిలో తోటకూరని ఉపయోగిస్తారు. తోటకూర తో ఈ సాంబార్ చేయడం వల్ల పోషక పదార్థాలు నిండుగా ఉంటాయి. దీనితో ఐరన్ కూడా అందుతుంది. ఇలా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

మధ్యాహ్నం భోజనం సమయంలో కానీ రాత్రి డిన్నర్ కి కానీ ఈ సాంబార్ తో భోజనం చేయొచ్చు. కావాలంటే మీరు ఇతర కాయగూరలు కూడా వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన వంట తయారు చేయాలనుకుంటే కచ్చితంగా ఈ రెసిపీని తయారు చేయాలి. అయితే మరి ఈ సాంబార్ ఎలా తయారు చేయాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
Serving: 2

ప్రధాన పదార్థం

  • 1 అవసరాన్ని బట్టి weight
  • 1 చేతి నిండా Weight
  • 3/4 చేతి నిండా Weight
  • 6 కప్ Weight
  • 2 Numbers weight
  • 5 Numbers Weight
  • 1/2 inch Weight
  • 2 టీ స్పూన్ Weight
  • 1 టీ స్పూన్ Weight
  • 2 అవసరాన్ని బట్టి Weight

ప్రధాన వంటకానికి

  • 1 అవసరాన్ని బట్టి weight
  • 1 చేతి నిండా Weight
  • 3/4 చేతి నిండా Weight
  • 6 కప్ Weight
  • 2 Numbers weight
  • 5 Numbers Weight
  • 1/2 inch Weight
  • 2 టీ స్పూన్ Weight
  • 1 టీ స్పూన్ Weight
  • 2 అవసరాన్ని బట్టి Weight

టెంపరింగ్ కోసం

  • 1 అవసరాన్ని బట్టి weight
  • 1 చేతి నిండా Weight
  • 3/4 చేతి నిండా Weight
  • 6 కప్ Weight
  • 2 Numbers weight
  • 5 Numbers Weight
  • 1/2 inch Weight
  • 2 టీ స్పూన్ Weight
  • 1 టీ స్పూన్ Weight
  • 2 అవసరాన్ని బట్టి Weight

How to make: కర్ణాటక స్టైల్ సాంబార్.. ఎంతో టేస్టీ..

Step 1:

ముందుగా తోటకూర, పాలకూర ఒక పాన్ లో వేసి నీళ్లు పోయాలి. రెండు నుండి మూడు నిమిషాల పాటు ఇది ఉడకాలి.

Samayam Telugu how to make huli sappu in easy process know here
కర్ణాటక స్టైల్ సాంబార్.. ఎంతో టేస్టీ..


Step 2:

ఒకసారి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో పసుపు, ధనియాలు, చింతపండు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు జీలకర్ర వేయాలి.



Step 3:

ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ వేసి అన్ని పదార్ధాలు బాగా ఉడికే వరకు ఉంచాలి. ఆకు కూరలు సాఫ్ట్ గా అయ్యేవరకు నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు ఉడికించండి.



Step 4:

ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వండి. ఒకసారి ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసి దీనిని గ్రైండ్ చేయండి.



Step 5:

పాన్ లో ఆయిల్ వేసుకుని వేడెక్కించండి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు వేసి చిటపటమన్నాక.. మెత్తగా ఆడిన పేస్టు ఇందులో వేసుకుని సాల్ట్ వేసి మరిగించండి.



Step 6:

ఇప్పుడు కొబ్బరి తురుముని దానిలో వేసి మిక్స్ చేయండి. నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అద్భుతమైన రెసిపీ తయారైపోయింది. మీరు అన్నం, చపాతీ లేదా దోసతో సర్వ్ తీసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.