యాప్నగరం

ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ భలే రుచి

జ్వరం వచ్చి అన్నం సహించనప్పుడు, రెండు లేక మూడు బ్రెడ్ స్లైసులూ, గ్లాసు పాలు తీసుకోవడం అనేది పాతమాట.

TNN 28 Jul 2016, 5:40 am
జ్వరం వచ్చి అన్నం సహించనప్పుడు, రెండు లేక మూడు బ్రెడ్ స్లైసులూ, గ్లాసు పాలు తీసుకోవడం అనేది పాతమాట. సమయం లేనప్పుడు పొద్దుటి పూట టిఫిన్ గా బ్రెడ్, జామ్ లేదా చక చకా శాండ్ విచ్ చేసుకొని తినడం ఇప్పటి ట్రెండ్. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ 'బ్రెడ్ బెటర్' అంటున్నారు. అలాంటి బ్రెడ్ తో చాలా వంటకాలు చేసుకోవచ్చు. అందులో ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ అనేదదానిని మనం ఇలా తయారు చేసుకోవచ్చు.
Samayam Telugu how to make instant bread mixer
ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ భలే రుచి

ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్ - ఏడు
బూందీ - అరకప్పు
ఉడికించిన ఆలూ - మూడు (మెదపాలి )
దానిమ్మ గింజలు - పావుకప్పు
చాట్ మసాలా - అరచెంచ
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నూనె - వేయించడానికి సరిపడా
నిమ్మరసం - రెండు చెంచాలు
తయారుచేసే పద్ధతి : బ్రెడ్ స్లైసుల అంచుల్ని తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ బ్రెడ్ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఓ గిన్నెలో నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకొని బాగా కలపాలి. తినే ముందు నిమ్మరసంత కలిపితే సరిపోతుంది. చాలా సులువుగా చేసుకొనే ఈ ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ ఎంతో రుచిగా ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.