యాప్నగరం

మటన్ కీమా బాల్స్... తయారీ

నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడు ఒకే రకంగా మటన్, చికెన్ తినడానికి ఇష్టపడరు.

TNN 28 Nov 2016, 8:01 pm
నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడు ఒకే రకంగా మటన్, చికెన్ తినడానికి ఇష్టపడరు. అలాగని రెస్టారెంట్ లో పెట్టే రేట్లు తట్టుకోవడం కూడా కష్టమే. అందుకే మేం కీమా బాల్స్ సులువుగా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో చెబుతున్నాం.
Samayam Telugu how to make mutton keema balls
మటన్ కీమా బాల్స్... తయారీ


కావాల్సిన పదార్థాలు

మటన్ కీమా - పావుకిలో, కొత్తిమీర తరుగు - అరకప్పు, అల్లం- ఒక ముక్క, వెల్లుల్లి - 5 రేకలు, పచ్చిమిర్చి - మూడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టీస్పూను, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం


మటన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కీమాలో నీరు లేకుండా పిండేయాలి. ఈలోపు కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రెండు స్పూనుల నీళ్లువేసి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టులోనే కీమా, ధనియాల పొడి, ఉప్పు, కారం కలిపి వేసి బాగా కలపాలి. ఆ మొత్తం మటన్ కీమా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. చుట్టినప్పుడు గట్టిగా నొక్కితే బాల్స్ విడిపోకుండా ఉంటాయి. ఒక గిన్నెలో నీళ్లు వేసి... అందులో బాల్స్ ని వేసి బాగా ఉడికించాలి. బాల్స్ ముక్కముక్కలుగా విడిపోతాయేమో అన్న భయం అవసరంలేదు. కీమాని కడిగినప్పుడు అందులో నీల్లు పిండేసాం కాబట్టి అంత త్వరగా బాల్స్ విడిపోవు. చక్కగా ఉడుకుతాయి. బాగా ఉడికాక వాటిని బయటికి తీసేయాలి. బాణలిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకుని వేడెక్కాక ... ఈ బాల్స్ ని అందులో వేసి వేయించాలి. గోల్డ్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకుంటే... మటన్ కీమా బాల్స్ సిద్ధమైపోతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.