యాప్నగరం

హెల్తీ స్నాక్స్: మొక్కజొన్న గారెలు..

వర్షాలతో పాటే మొక్కజొన్న పొత్తులు వచ్చేస్తాయి. వీటితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. వాటిలో ఒక వెరైటీనే 'మొక్కజొన్న వడలు'. చల్లని వర్షపు సాయంత్రాలకు ఈ మొక్కజొన్న వడలు మంచి కాంబినేషన్.

Samayam Telugu 23 Jul 2018, 7:15 pm
వర్షాలతో పాటే మొక్కజొన్న పొత్తులు వచ్చేస్తాయి. వీటితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. వాటిలో ఒక వెరైటీనే 'మొక్కజొన్న వడలు'. చల్లని వర్షపు సాయంత్రాలకు ఈ మొక్కజొన్న వడలు మంచి కాంబినేషన్. వీటి తయారీ విధానం కూడా చాలా సులువు. కిచెన్‌లో దొరికే వస్తువులతోనే మొక్కజొన్న వడలను తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న పొత్తులను మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే చేసేద్దాం.
Samayam Telugu corn wada


కావలసిన పదార్ధాలు: మొక్కజొన్న పొత్తులు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, మిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట (చిన్నది), కరివేపాకు - రెమ్మ, అల్లం - చిన్న ముక్క, జీలకర్ర - ఒక టీ స్పూన్, ఉప్పు- తగినంత, నూనె - సరిపడినంత, శనగపిండి- రెండు టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్- రెండు టీ స్పూన్లు,

తయారు చేసే విధానం:
* మొక్కజొన్న పొత్తును ఒలచి పెట్టుకోవాలి. వీటికి తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసేప్పుడు నీటిని వాడకూడదు.
* ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. కార్న్‌ఫ్లోర్ జతచేసి బాగా కలపాలి. ఒక వేళ పొత్తులు లేతగా ఉండి, పిండి పలుచగా అయితే శనగపిండి కలుపుకోవచ్చు.
* తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకొని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే వేడివేడిగా క్రిస్పీగా ఉండే మొక్కజొన్న వడలు రెడీ అయినట్లే.. టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.