యాప్నగరం

సాయంత్రం వేళ... కార్న్ పకోడీ

శెనగపిండితో పకోడీ తిని బోర్ కొట్టిందా... కొత్త రుచి కోసం నాలుక ఎదురుచూస్తోందా

TNN 29 Dec 2016, 7:50 pm
శెనగపిండితో పకోడీ తిని బోర్ కొట్టిందా... కొత్త రుచి కోసం నాలుక ఎదురుచూస్తోందా... అయితే మొక్క జొన్న గింజలతో పకోడీ చేసుకుని తినండి. ఆరోగ్యంతో పాటూ మంచి రుచి కూడా తగులుతుంది.
Samayam Telugu recipe how to make corn pakoda
సాయంత్రం వేళ... కార్న్ పకోడీ


కావాల్సిన పదార్థాలు

శెనగపిండి - ఒక కప్పు, మొక్కజొన్న గింజలు - ఒక కప్పు, తరిగిన ఉల్లిముక్కలు - పావు కప్పు, బియ్యప్పిండి - ఒక టీస్పూను, పచ్చిమిర్చి - నాలుగు, జీలకర్ర - ఒక టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, వంటసోడా - చిటికెడు, నూనె - సరిపడినంత

తయారు చేయు విధానం


మొక్క జొన్న గింజల్ని ఉడికించి, నీరు వార్చేయాలి. మొక్కజొన్న గింజలున్న గిన్నెలో శెనగపిండి, బియ్యంప్పిండి వేసి కాస్త నీరు వేసి చేతితో కలపాలి. తరువాత నూనె తప్ప పైన చెప్పిన పదార్థాలన్నీ వేసేసి మళ్లీ కలపాలి. పకోడీ వేయడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. కావాలంటే కాస్త నీరు కలుపుకోవచ్చు. ఓ అయిదు నిమిషాల పాటూ మిశ్రమాన్ని అలా వదిలేయాలి. ఇప్పుడు కళాయిలో నూనె బాగా కాగాక... మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. గోల్డెన్ బ్రైన్ రంగులోకి వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే కార్న్ పకోడీ సిద్ధమైనట్టే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.