యాప్నగరం

కోడిగుడ్లతో కీమా కర్రీ

మటన్ కీమా, చికెన కీమా కర్రీలు తెలుసు కదా... అలాగే కోడి గుడ్లతో కూడా టేస్టీ కీమా కర్రీ వండుకోవచ్చు.

TNN 21 Feb 2017, 7:38 pm
మటన్ కీమా, చికెన కీమా కర్రీలు తెలుసు కదా... అలాగే కోడి గుడ్లతో కూడా టేస్టీ కీమా కర్రీ వండుకోవచ్చు. చేయడం పెద్ద కష్టమేం కాదు చాలా సులువు.
Samayam Telugu recipe how to make keema curry with eggs
కోడిగుడ్లతో కీమా కర్రీ


కావాల్సిన పదార్థాలు

ఉడికించిన కోడి గుడ్లు - ఆరు, పచ్చి బఠాని - అర కప్పు, టమోటా గుజ్జు - అరకప్పు, కొత్తి మీర తరుగు - అరకప్పు, బిర్యాని ఆకు - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, దాల్చిన చెక్క - చిన్న ముక్క, యాలకులు - 3, లవంగాలు - 2, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - తగినంత, కారం - అరటీస్పూను, పసుపు - చిటికెడు.

తయారుచేసే విధానం

గుడ్లను ఉడకబెట్టి పచ్చసొనను తీసేయాలి. ఉడికిన తెల్లసొనను సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి.... అందులో బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేయించాలి. అవి వేగాక ఉల్లి తరుగు వేయాలి. అది కూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్దు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. టమోట తరుగు కూడా వేసి బాగా కలపాలి. టమోటాలు కాస్త మెత్తబడినట్టు అవుతాయి అప్పుడు కారం, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు అందులో ముందుగా తరిగి పెట్టుకున్న గుడ్ల తరుగును వేసి బాగా కలపాలి. అలాగే పచ్చిబఠాణీలు, కాస్త ఉప్పు కూడా వేసి ఉడికించాలి. దించడానికి అయిదు నిమిషాలు ఉందనగా కొత్తిమీర చల్లాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.