యాప్నగరం

పన్నీర్ గులాబ్ జామున్

పన్నీర్ తో చేసే స్వీటుల్లో గులాబ్ జామ్ కూడా ఒకటి.

TNN 14 Apr 2017, 2:43 pm
పన్నీర్ తో చేసే స్వీటుల్లో గులాబ్ జామ్ కూడా ఒకటి. మామూలు గులాబ్ జామున్లతో పోలిస్తే... పన్నీర్ గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. చాలా సులువుగానే చేసుకోవచ్చు.
Samayam Telugu recipe how to make paneer gulab jamun
పన్నీర్ గులాబ్ జామున్


కావల్సిన పదార్థాలు:


పాలపొడి - రెండు కప్పులు, రవ్వ - రెండు టీస్పూనులు, గుడ్డు - ఒకటి, పనీర్ తురుము - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, నీళ్లు - రెండు కప్పులు, బేకింగ్ సోడ: పావు స్పూను, నూనె - వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం

ఒక గిన్నెలో రవ్వ, పన్నీరు తురుము, పాలపొడి వేసి కలపాలి. అందులో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసుకోవాలి. పది నిమిషాలు పక్కన వదిలేయాలి. ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు, పంచదార వేసి పాకం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మరో గిన్నె పెట్టి అందులో నూనె వేయాలి. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పన్నీరు మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేసి వేయించాలి. గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసి... పంచదార పాకంలో వేయాలి. అందులో ఓ అరగంట పాటు ఉంచి తీసి సర్వ్ చేయాలి. టేస్టీ పన్నీరు గులాబ్ జామూన్లూ నోరూరిస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.