యాప్నగరం

పల్లీలతో హెల్తీ బర్ఫీ

వేరుశెనగపలుకులతో చిక్కీ చేసుకుని తింటాం.

TNN 18 Mar 2017, 1:32 pm
వేరుశెనగపలుకులతో చిక్కీ చేసుకుని తింటాం. అది చాలా బలమని చెబుతారు పెద్దలు. అలాగే వాటితో బర్ఫీ కూడా చేసుకోవచ్చు. టేస్టుతో పాటూ హెల్తీ కూడా.
Samayam Telugu recipe how to make peanut burfi
పల్లీలతో హెల్తీ బర్ఫీ


కావాల్సిన పదార్థాలు

వేరు శెనగపలుకులు (పల్లీలు) - పావు కిలో, నెయ్యి - ఒక టీస్పూను, పంచదార - 150 గ్రాములు, కుంకుమపువ్వు - రెండు రెమ్మలు, బాదం, పిస్తాల తరుగు - పావు కప్పు, నీళ్లు - రెండు గ్లాసులు.

తయారు చేసే విధానం

పల్లీలను ముందుగా వేయించుకోవాలి. పైన తొక్క తీసేయాలి. మిగతా వాటిని మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి. అలాగే బాదం పలుకులు, పిస్తాల తరుగును నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు, చక్కెర వేసి లేతపాకం తీసుకోవాలి. లేత పాకం వస్తున్నప్పుడు పల్లీల పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం చిక్కబడుతున్నప్పుడు వేయించిన బాదం, పిస్తాల తరుగును వేసి కలపాలి. అలాగే కుంకుమపువ్వు కూడా వేయాలి. ఆ మిశ్రమం మరీ గట్టిపడకముందే స్టవ్ కట్టేయాలి. ఆ మిశ్రమాన్ని పళ్లెంలో వేసి చల్లారనివ్వాలి. అనంతరం నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి. ఇది వారం రోజుల పాటూ తాజాగా ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.