యాప్నగరం

ఈ పోషకాల కేక్ చేసి చూడండి!

పిల్లలు ఎక్కువగా అడిగేది కేక్. రోజూ ఇస్తే ఆరోగ్యం పాడవుతుందని తల్లుల భయం.

TNN 12 May 2017, 2:48 pm
పిల్లలు ఎక్కువగా అడిగేది కేక్. రోజూ ఇస్తే ఆరోగ్యం పాడవుతుందని తల్లుల భయం. అలాంటి తల్లులకే ఈ పోషకాల కేక్ రెసిపీ. దీనిని రాగి పిండితో చేస్తారు కనుక... ఎన్నిసార్లు తిన్నా పిల్లలకి బలమే.
Samayam Telugu recipe how to make ragi cake
ఈ పోషకాల కేక్ చేసి చూడండి!


కావాల్సిన పదార్థాలు

రాగిపిండి - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, వెన్న - ఒక కప్పు, కోడిగుడ్లు - మూడు, వెనిల్లా ఎసెన్సు - ఒక టీస్పూను, వంటసోడా - అర టీస్పూను

తయారు చేసే విధానం

రాగిపిండిలో వంట సోడా కలిపేయాలి. ఉండలుగా లేకుండా నలిపి... జల్లించాలి. ఒక గిన్నెలో రాగిపిండి వేసి అందులో కోడి గుడ్ల సొన కలిపి బాగా గిలక్కొట్టాలి. అందలో చక్కెర కూడా వేసి మళ్లీ గిలక్కొట్టాలి. తరువాత వెనిల్లా ఎసెన్సు కూడా వేసి కలపాలి. కేకు మౌల్డ్ అడుగు భాగాన వెన్న రాసి... అందులో రాగిపిండి మిశ్రమం వేయాలి. ఓవెన్ లో అరగంటే పాటూ బేక్ చేయాలి. అంతే రాగిపిండితో కేక్ సిద్దమై బయటికి వస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.