యాప్నగరం

ఇలా చేస్తున్నాడంటే అబద్ధం చెబుతున్నట్లే!

ఎదుటి వ్యక్తి ఏదైనా విషయం దాచిపెడుతున్నప్పుడు లేదా అబద్ధం చెబుతున్నప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ ద్వారా దాన్ని పసిగట్టవచ్చు. ఎ

TNN 8 Mar 2017, 5:48 pm
ఈ రోజుల్లో అబద్ధం చెప్పడం సాధారణమైపోయింది. కొన్ని సందర్భాల్లో ఫర్వాలేదు కానీ.. ఒక్కోసారి నిజం తెలుసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ఎదుటి వ్యక్తి ఏదైనా విషయం దాచిపెడుతున్నప్పుడు లేదా అబద్ధం చెబుతున్నప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ ద్వారా దాన్ని పసిగట్టవచ్చు. ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమో, అబద్ధమో తెలుసుకునేందుకు ఈ పది టిప్స్ ఉపయోగపడతాయి. అవేంటో ఓ లుక్కేయండి..
Samayam Telugu 10 ways to know if someone is lying to you
ఇలా చేస్తున్నాడంటే అబద్ధం చెబుతున్నట్లే!


* అబద్ధం చెప్పాల్సి వచ్చిన సందర్భంలో అవసరానికి కంటే ఎక్కువగా మాట్లాడుతుంటారు. అనవసరమైన, పొంతన లేని వివరణలు ఇస్తుంటారు. చెప్పే అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడంలో భాగంగానే ఇలా జరుగుతుతుంటుంది.

* చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతుంటారు. ఎక్కడ దొరికిపోతామో అనే భయం వారిలో కనిపిస్తుంది.

* అబద్ధం చెప్పే వారి మాటలు ఒక్కోసారి కన్ఫ్యూజన్‌గా ఉంటాయి. మీరడిగే ప్రశ్నలకు నేరుగా బదులివ్వరు. అసలు విషయం కంటే మిగతా విషయాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది.

* అబద్ధం చెప్పేటప్పుడు తమకు తెలియకుండానే కాసేపైనా నోటికి చేతిని అడ్డు పెడతారు. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు ముఖాన్ని చేతులతో తాకుతున్నారన్నా లేదా పెదాలను తాకుతున్నారన్నా వారు అబద్ధం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం.

* ఒక్కసారి ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలించండి. ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేనప్పుడు రిలాక్స్‌గా ఉంటాడు. ఏదైనా విషయం దాచిపెట్టాలని భావించినప్పుడు చాలా మంది తమ చేతులను ఛాతికి అడ్డు వచ్చేలా క్రాస్‌గా పెట్టి కూర్చుంటారు.

* అదే పనిగా పాదాలను కదలాడిస్తుంటారు. సదరు వ్యక్తిలో భయం పెరుగుతోందనడానికి ఇది సూచిక.

* అబద్ధం చెప్పేవాళ్లు కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేరు. మీరు చూసినా వారు చూపు తిప్పుకుంటారు. మీరు వారివైపు చూసినప్పుడల్లా పక్కకు చూసేందుకు ప్రయత్నిస్తారు.

* నిశితంగా పరిశీలించే శక్తి మీకు ఉంటే.. అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో భయాన్ని గమనించవచ్చు. వారు ఎక్కువగా నవ్వుతుంటారు. కనుబొమ్మలు వణుకుతుంటాయి. చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలో ఇలాంటి మార్పులను మీరు ఈజీగా పట్టేయవచ్చు.

* మీరేదైనా ట్రిక్కీగా ఉండే ప్రశ్న అడిగితే వారి బాడీ లాంగ్వేజీలో మార్పు రావడం స్పష్టంగా గమనించవచ్చు. అబద్ధం చెప్పేవారు అసంకల్పితంగా తలను ఎక్కువగా కదిలిస్తుంటారు.

* గట్టిగా శ్వాస తీసుకోవడం అనేది అబద్దం చెప్పే వారిలో సాధారణంగా కనిపించే లక్షణం. వారి మాటలోనూ టెన్షన్ కనిపిస్తుంది. వారు శ్వాస తీసుకునే క్రమం మారుతుంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.