యాప్నగరం

‘పెళ్లికి ముందే మరో వ్యక్తితో ఆ అనుభూతి.. కాబోయే భర్తకు ఈ విషయం..’

ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లి కుదిరింది. కానీ, అంతకు ముందే ఆమె మరో వ్యక్తితో ఏకాంతంగా కలిసింది. ఈ విషయాన్ని తనకు కాబోయే భర్తకు చెప్పాలని అనుకుంటోంది.

Samayam Telugu 4 May 2021, 11:05 pm
సమస్య: మా పెద్దలు ఇటీవలే ఓ అబ్బాయితో పెళ్లి కుదిర్చారు. ఐదు నెలల కిందట నేను అతడిని తొలిసారి మా ఇంట్లో కలిశాను. ఆ తర్వాత మరికొన్ని సార్లు మాత్రమే కలిశాను. కానీ రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం. దీంతో మా మధ్య చనువు బాగా పెరిగింది. అయితే, పెళ్లి తర్వాత నేను వర్జిన్ కాదని తెలిస్తే అతడు బాధపడతాడేమో అనే ఆందోళన నన్ను వెంటాడుతోంది. ఈ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పాలా? వద్దా? అనే సందేహంలో ఉన్నాను. గతంలో నేను మరో వ్యక్తితో ఏకాంత క్షణాలు గడిపాననే విషయాన్ని చెప్పవచ్చా? సలహా ఇవ్వగలరు.
Samayam Telugu Representational Image

- ఓ సోదరి (ప్రైవసీ నిమిత్తం పేరు గోప్యంగా ఉంచాం)
‘నా ఫ్రెండ్.. ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి సిగ్గులేకుండా ఆ తప్పు..’
సమాధానం: కొన్ని విషయాల్లో నిజాయతీ మంచిదే. కానీ.. అన్ని విషయాల్లో కాదు. పెళ్లికి ముందు మీ భర్తకు అన్ని విషయాలు చెప్పేయాలని భావించడం మెచ్చుకోదగిన విషయమే. కానీ, కొన్ని కష్టాలకు ఆ నిజాయతీయే కారణం కావచ్చు. అయితే, మీరు చెప్పే విషయాలను అతడు అర్థం చేసుకొనే స్వభావం కలిగినవాడేనా? ఎందుకంటే.. కొందరు మొదట్లో అలాంటివి పట్టించుకోమని చెప్పినా.. పెళ్లి తర్వాత ఏదైనా సందర్భంగా వచ్చినప్పుడు ఆ తప్పులను వేలెత్తి చూపుతారు. పైగా ఇలాంటి విషయాలను తెలిస్తే మీతో ఇప్పుడు ఉన్నంత అన్యోన్యంగా అప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి, గతంగతః. ఇప్పుడు మీరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇకపై అదే మీ జీవితం. ఇకపై అతడి మీ జీవితాన్ని అందంగా మార్చుకొనే ప్రయత్నం చేయండి. మీ గతాన్ని తవ్వకొని భవిష్యత్తను నాశనం చేసుకోకండి.
‘నేను నా భార్యను మోసం చేశాను.. ఆఫీసులో మరో అమ్మాయితో..’
సలహా ఇచ్చినవారు: డాక్టర్ సంజయ్ చుగ్, సీనియర్ కన్సాల్టెంట్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్

(టైమ్స్ ఆఫ్ ఇండియా/లైఫ్‌స్టైల్/ఆస్క్ ది ఎక్స్‌పర్ట్ నుంచి సేకరణ)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.