యాప్నగరం

టాటూ ఉంటే గర్ల్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు!

అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడం ఎలా..? చాలా మంది అబ్బాయిల మెదళ్లను తొలిచే ప్రశ్న ఇది. దీనికి ఓ పరిశోధన బదులిస్తోంది.

TNN 31 Oct 2017, 4:08 pm
అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడం ఎలా..? చాలా మంది అబ్బాయిల మెదళ్లను తొలిచే ప్రశ్న ఇది. దీనికి ఓ పరిశోధన బదులిస్తోంది. టాటూలు వేసుకునే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టమని చెబుతోంది. టాటూ వేసుకున్న బాయ్స్ పట్ల మూడింట రెండొంతుల గర్ల్స్ అట్రాక్ట్ అయ్యారట. టైప్ అనే డేటింగ్ యాప్ ఈ పరిశోధన చేసింది. శరీరంపై ఇంక్ బాడీ ఆర్ట్ ఉన్న మగాళ్లను ఇష్టపడుతున్నామని 64 శాతం మంది మగువలు వెల్లడించారు.
Samayam Telugu girls get more attracted to men with tattoos
టాటూ ఉంటే గర్ల్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు!


కేవలం అబ్బాయిలనే కాదు.. ఒకే లైంగికత ఉన్న పార్టనర్ కోసం చూస్తున్నవారు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టాటూల కారణంగా అదనపు ఆకర్షణ, ప్రేమించే ఆసక్తి కలుగుతోందని చెప్పారు. టాటూల కారణంగా ఆకర్షణ కలగడం అనేది ఆశ్చర్యానికి గురి చేసిందని టైప్ సీఈవో బెన్నో స్పెన్సర్ తెలిపారు. గతంలో నిర్వహించిన ఓ పరిశోధన కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

కానీ అబ్బాయిల విషయానికి వస్తే.. కేవలం 39 శాతం మంది మాత్రమే టాటూలు ఉన్న అమ్మాయిల పట్ల ఆకర్షణకు లోనయ్యారని టైప్ రీసెర్చ్‌లో తేలింది. ఈ పరిశోధన విషయం తెలిసింద కాబోలు బ్రిటన్లోని బర్మింగ్‌హమ్‌లో ఎక్కువ మంది టాటూలు వేసుకొని కనిపిస్తారు. బ్రిటన్లో ప్రతి ఐదుగురు పెద్దల్లో ఒకరికి టాటూ ఉంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.