యాప్నగరం

లైంగికంగా వాడుకున్నాడు, కానీ తనే కావాలి!

నాకు 24 ఏళ్లు. 31 ఏళ్ల వయసున్న వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాకు పద్దెనిమిదేళ్లు

TNN 16 Feb 2017, 7:16 pm
ప్రశ్న: హాయ్, నాకు 24 ఏళ్లు. 31 ఏళ్ల వయసున్న వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాకు పద్దెనిమిదేళ్లు ఉన్నప్పుడు అతడితో పరిచయమైంది. అప్పట్లో మేం ఇద్దరం ఇరుగు పొరుగున ఉండే వాళ్లం. అతడికి పెళ్లి కాక ముందు నా వెంట పడేవాడు, వేధించేవాడు. కొంత కాలానికి నేను కూడా తనను ప్రేమించడం మొదలుపెట్టాను. తనకు సెక్స్ కావాలని అనుకున్నప్పుడల్లా నన్ను పిలిచేవాడు. పై చదువుల కోసం వేరే ఊరు వెళ్లినప్పుడు అతడు నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. కానీ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నన్ను వాడుకునేవాడు.
Samayam Telugu he used me but i still love him
లైంగికంగా వాడుకున్నాడు, కానీ తనే కావాలి!


మా రిలేషన్‌షిప్ గురించి మాట్లాడదాం అంటే అతడు వినేవాడు కాదు. దీంతో అతడికి దూరంగా ఉండాలని భావించాను. కానీ నన్ను వాడుకున్నానని, తన కోరికలు తీర్చుకున్నాని నా ఫ్రెండ్‌కి చెప్పాడు. ఐనా ఈ ఐదేళ్లలో అతడ్ని ఒక్కసారి కూడా కలవలేదు. ఇప్పుడు నేను ఓ పెద్ద కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. నా జీవితం చాలా సాఫీగా సాగిపోతోంది. కానీ నేను ఇప్పటికీ తనను మర్చిపోలేకపోతున్నాను. ఇంకా తననే ప్రేమిస్తున్నా. మరొకరితో అనుబంధం దిశగా ఆలోచించలేకపోతున్నా. అతడికి తన భార్య, పిల్లలంటే ఇష్టమని నాకు తెలుసు. అతడు ఇప్పటికీ నా ప్రేమను గుర్తించలేకపోతున్నాడు. ఈ సమస్య నుంచి నేను బయటపడేదెలా? - పేరు రాయలేదు.


జవాబు: అతడితో అనుంబంధాన్ని కట్ చేసుకొని మీరు మంచి పని చేశారు. మీ చర్య వల్ల మీరు మరింత బాధపడకుండా ఉండగలిగారు. అతడితో కలిసి గడపటం వల్ల తనను మర్చిపోలేకపోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి, అతణ్ని మర్చిపోవడానికి ఈ పనులు చేయండి.

- అతడికి మీరంటే ప్రేమ లేదు. మీరు మళ్లీ మీ ప్రేమ గురించి అతడితో చెప్పినా ప్రయోజనం ఉండదు. అతడంటే మీకు ఇష్టం లేదని పదే పదే మీకు మీరే చెప్పుకోండి. ఫలితంగా బెటర్‌గా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.

- మిమ్మల్ని, మీ భావాలను గౌరవించే భాగస్వామి కోసం వెతకండి. తద్వారా మీరు ఆరోగ్యవంతమైన రిలేషన్‌షిప్‌ను ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు మీరు ప్రేమించిన వ్యక్తి మీ శరీరాన్ని కోరుకున్నాడేగానీ.. మిమ్మల్ని ప్రేమించలేదు. మీ తల్లిదండ్రుల సహకారంతో అరెంజ్‌డ్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు.

- కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. డ్యాన్స్ చేయడం, ఏవైనా గేమ్స్ ఆడటం లాంటివి చేయండి. వీటి వల్ల మీరు ఉత్సాహంగా ఉండటంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

- అంతర్గతంగా, బాహ్యంగా మీరెంతో అందమైన వ్యక్తనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు చక్కటి భవిష్యత్తు ఉందని మరవొద్దు. మీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తీయండి. పాజిటివ్‌గా ఆలోచించండి.

సమాధానం ఇచ్చినవారు: Smriti Sawhney Joshi is a Chief Psychologist with ePsyclinic.com

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.