యాప్నగరం

ఒక రాత్రిలో రెండుసార్లు కలిస్తే.. గర్భం దాల్చే ఛాన్స్ అధికం!

పిల్లలను కనాలని భావించే దంపతులు ఒక్క రాత్రిలో రెండుసార్లు సెక్స్ చేయడం వల్ల గర్భధారణకు మెరుగైన అవకాశాలు ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

Samayam Telugu 21 Sep 2018, 4:43 pm
పిల్లలను కనడం కోసం చాలా మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. పెళ్లయ్యి ఏళ్లు గడిచినా సంతానం లేక ఎంతో మంది మానసిక వేదనకు గురవుతుంటారు. ఇలాంటి వారు డాక్టర్లను సంప్రదించడంతోపాటు.. పిల్లలను కనడం కోసం రకరకాల మార్గాలను ప్రయత్నిస్తుంటారు. గర్భధారణకు మందులతోపాటు ఇతర టెక్నిక్‌లు కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. పిల్లలను కనాలనుకునేవారు ఒక రాత్రిలో రెండుసార్లు శృంగారం చేయడం వల్ల ఫలితం ఉంటుందట. ఇలా చేయడం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయట.
Samayam Telugu s11


రెండోసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషుడు స్ఖలించిన వీర్యం మరింత శక్తివంతంగా, వేగంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. తొలిసారి సెక్స్ చేసిన మూడు గంటల తర్వాత మరోసారి కలవడం వల్ల మెరుగైన అండం పొదగడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయట. క్లయిమాక్స్‌కు చేరిన 180 నిమిషాల తర్వాత ఉత్పత్తయిన వీర్యంతో పిల్లలు పుట్టే అవకాశాలు ఐవీఎఫ్ కంటే అధికమట. రెండోసారి స్ఖలించిన వీర్యంలో ప్రొటీన్ అధికంగా ఉండటతోపాటు అది వేగంగా చలిస్తుంది.

వీర్య స్ఖలనం తర్వాత పురుషుడిలో మళ్లీ పూర్తి స్థాయిలో వీర్యం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 36 గంటల సమయం అవసరం అనేది కేవలం అపోహే అని తాజా పరిశోధనతో తేలిపోయింది. ప్రతి ఏడు బ్రిటిష్ జంటల్లో ఒక జంట సంతానలేమితో బాధపడుతోంది. ఇలాంటి తరుణంలో ఈ పరిశోధన చాలా మందికి ఊరటనివ్వనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.