యాప్నగరం

Brother in law behaves badly : బావ అలా చేసినా.. మా ఆయన పట్టించుకోవట్లేదు..

Brother in law behaves badly : ఉమ్మడి కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా ఆ ఎఫెక్ట్ మొత్తం కుటుంబంపైనే పడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఓ వ్యక్తి చేసిన తప్పుతో అన్నాదమ్ముల మధ్య చిచ్చురేగేలా ఉంది. అదేంటో చూద్దాం.

Produced byరావుల అమల | Samayam Telugu 29 Mar 2023, 8:25 pm
సాధారణంగా అన్నదమ్ములు అంటే కొట్టుకుంటారు. తిట్టుకుంటారు. మళ్ళీ కలిసి ఉంటారు. అదే వారికి భార్యలు వచ్చాక వేరే పరిస్థితి ఉంటుంది. ఇద్దరి అన్నదమ్ముల్లో ఏ ఒక్కరు మంచివారు కాకపోయినా మొత్తం కుటుంబమే చిన్నాభిన్నమవుతుంది. ఈ నేపథ్యంలోనే తమ్ముడి భార్యపైనే అన్న ప్రవర్తన తేడాగా ఉండడంతో మరదలి స్థానంలో ఉన్న మహిళ తట్టుకోలేక భర్తకి చెప్పింది. దీంతో ఏమవుతుందో చూద్దాం.
Samayam Telugu how do i handle my creepy brother in law
Brother in law behaves badly : బావ అలా చేసినా.. మా ఆయన పట్టించుకోవట్లేదు..


ఆమె సమస్య..

హాయ్.. మాది అరెంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ, మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ కంటే అన్యోన్యంగా కలిసి ఉంటాం. నా అత్తగారింట్లో అంతా బావుండేది. దీంతో నా అంతా అదృష్టవంతురాలు ఎవరు లేరని అనుకున్నా. కానీ, ఇదంతా కూడా ఒక్క నెలలోనే తారుమారైంది.


Also Read : Millets Uses : మిల్లెట్స్ ఇలా తింటే చాలా మంచిది..

ఆ రోజు ఏమైందంటే..

నేను జాబ్ చేస్తుంటా. ఆఫీస్‌కి వెళ్ళే హడావిడిలో ఉన్నా. ప్రతి సారి మా రూమ్ డోర్ వేసుకుంటా. కానీ, ఆ రోజు మర్చిపోయి రెడీ అవుతున్నా. డోర్ తీసే ఉంది. ఆ సమయంలో మా బావగారు మా రూమ్ వైపే వచ్చారు. నేను చూడడం లేదనుకుని లోపలికి వచ్చారు. అలానే ఉన్నార. నేను గమనించనట్లుగానే నటించి చివరికి రెడీ అయి బయటికి వచ్చా..

రెండోసారి..

మేము, మా బావగారి కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉంటాం. మాది ఓపెన్ కిచెన్. నేను అక్కడ వంట చేస్తున్నప్పుడు మా బావగారి కళ్ళన్ని నా వైపే ఉండడం గమనించా. అతను నన్ను ఎంత దారుణంగా చూశాడో ఇప్పటికీ మర్చిపోలేదు.
Also Read : Valentine's Day 2023 : లవ్ చేస్తున్నవారికి ఈ మాటలు చెప్పండి.. పడిపోతారంతే..

నా భర్తకి కూడా చెప్పా..

ఈ విషయాన్నంతా నేను నా భర్తకి చెప్పా. కానీ, తను పట్టించుకోవడం లేదు. ఇదే సమస్యని మా ఆడపడుచు ఉంది తనకి చెప్పాలా వద్దా.. ఇది మా కుటుంబాన్ని విడిపోయేలా చేస్తుందా. ఎందుకంటే మా బావగారు అందరి దృష్టిలో చాలా మంచివాడు.

అతని సమస్య..

నా భార్య చాలా అందంగా ఉంటుంది. మా చుట్టాలు, బ్రదర్స్ అంతా నన్ను తెగ ఏడిపిస్తుంటారు. లాస్ట్ మంథ్ నా భర్య నా దగ్గరికొచ్చి మా అన్నయ్య తనని తప్పుడు ఉద్దేశ్యంతో చూస్తున్నాడని చెప్పింది. ఈ విషయం గురించి మా అన్నయ్యతో మాట్లాడమంది..

అన్నకి, నాకు గొడవలు అవుతాయని..

అయితే, ఇదే విషయం మా అన్నయ్యతో మాట్లాడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, నా భార్య చెప్పేది అబద్ధమైతే, నేను ఏం చేయాలి. ఈ విషయం మా ఇద్దరిని విడదీస్తుంది. మా వదిన చాలా మంచిది. ఆవిడతో కూడా రిలేషన్ పాడవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయా. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి.

విశాల్ భరద్వాజ్(Founder and Relationship Coach at Predictions For Success) సమాధానం..

నమ్మకం అనేది ఏ రిలేషన్‌లో అయినా ఉండాలి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రతి విషయంలోనూ వారికి అండగా ఉండాలి. నమ్మకం అనేది మీ రిలేషన్‌‌ని మరింత దృఢంగా చేస్తుంది.
Also Read : Rectal cancer Causes : ఎక్కువగా కూర్చుంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట..

ఆమెకోసం..

మీరు మీ సమస్యని బయటికి చెప్పడం నిజంగా ఆనందించే విషయం. మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తి ఎవరైనా.. ఎలా ఉన్నా మీరు ఆ విషయాన్ని బయటికి చెప్పడం అనేది చాలా ధైర్యంతో కూడిన విషయం. మీరు తను మీ పట్ల ఏం చేస్తున్నాడో గమనించారు.ఇదంతా మీ భర్తకి చెప్పొచ్చు.

ఓపిక అవసరం..

అయితే, జరిగినవన్నీ నిజమే అయినా.. దానిపై మీ భర్త ఏదైనా నిర్ణయం తీసుకునేవరకూ ఓపిక అవసరం. ఆలోచించకుండా మీరు చెప్పే విషయాలు నమ్మడం మీ హజ్బెండ్‌కి అంత ఈజీ కాదు. ఎందుకంటే అవతలి వ్యక్తి స్వయానా అన్నయ్య కాబట్టి. అతనికి కాస్తా టైమ్ ఇవ్వండి. కాస్తా టైమ్ ఇస్తే తనకు తానుగానే మీ పట్ల అతని అన్నయ్య ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుంటాడు.

నిజమేనని..

మీకు మీ బావగారిపై గౌరవం ఉందని, అయినా జరిగింది ఇదేనని అబద్ధం కాదని తనకి చెప్పండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని తనకి తెలపండి. అసలు ఏం జరిగిందో ఓసారి క్లియర్‌గా చెప్పి తనని ఆలోచించమని, గమనించమని చెప్పండి.

అతని కోసం..

మీరు కొన్ని విషయాలు గమనించాలి. అదేంటంటే.. ఎవరైనా తప్పులు చేస్తారు. అది మీ అన్నయ్య అయినా పర్లేదు. తప్పు చేయడని కాదు. అయితే, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని మీ భార్య చెప్పేది వినండి. గమనించండి. ఎందుకంటే తను ఊరికే అబద్ధం చెప్పదుగా. గమనించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ సమస్యని మీరు మాత్రమే పరిష్కరించగలరు కాబట్టి, మీరు కచ్చితంగా ఎలాంటి విషయాలనైనా గమనించాలి. ఎందుకంటే మీ భార్య మీ బాధ్యత కాబట్టి.. ఆమెకి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించాల్సి బాధ్యత కూడా మీపైనే ఉంది.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.