యాప్నగరం

ఎంతసేపు సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు ?

పాశ్చాత్య దేశాల్లో జూన్ 9వ తేదీని నేషనల్ సెక్స్ డేగా సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ వుంది. ఈ క్రమంలోనే..

Samayam Telugu 22 Jun 2017, 8:33 pm
పాశ్చాత్య దేశాల్లో జూన్ 9వ తేదీని నేషనల్ సెక్స్ డేగా సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ వుంది. ఈ క్రమంలోనే ఇటీవల జూన్ 9వ తేదీన జరుపుకున్న నేషనల్ సెక్స్ డే సందర్భంగా ఆన్‌లైన్‌లో సెక్స్ టాయ్స్ సేల్ చేసే లవ్‌హనీ అనే ఓ కంపెనీ ఓ అధ్యయనాన్ని చేపట్టింది. సాధారణంగా ఎవరు ఎక్కువసేపు సెక్స్ ఎంజాయ్ చేయగలుగుతున్నారు ? రతి క్రీడ కోసం వాళ్లు వెచ్చిస్తున్న సమయం ఎంత అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది.
Samayam Telugu how long should sex last
ఎంతసేపు సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు ?


4,400 మందిపై జరిపిన ఈ అధ్యయనం ఫలితాలని విశ్లేషించగా తేలింది ఏంటంటే... సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది సగటున అర్ధగంటపాటు సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారని. కానీ మిగతావారిలో 23శాతం మంది పురుషులు, మరో 15 శాతం మంది మహిళలు సెక్స్‌ని అతి త్వరగా ముగిస్తున్నట్టు చెప్పారు.

చాలామంది జంటలు సగటున తాము 19 నిమిషాలపాటు మాత్రమే సెక్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఓ 10 నిమిషాలు ఫోర్ ప్లే కోసమైతే మరో 9 నిమిషాలు సంభోగం కోసం వెచ్చిస్తున్నారు. ఇక 30 నిమిషాలపాటు శృంగారం అనేది చాలామందికి ఓ కలగానే మిగిలిపోవడమేకాకుండా ఆ కలని నిజం చేసుకోలేకపోతున్నామే అనే ఫ్రస్ట్రేషన్ కూడా వస్తోందట!

వాస్తవానికి మగవారికన్నా ఆడవారికే భావప్రాప్తి ఆలస్యంగా కలుగుతుందని గతేడాది జరిపిన ఓ సర్వే అభిప్రాయపడింది. కానీ కొత్తగా ఈ లవ్ హనీ జరిపిన అధ్యయనంలో తేలింది ఏంటంటే.. 90 శాతం మంది జంటలకి తమ దాంపత్య జీవితంలో ఏదో ఓ సందర్భంలో ఇద్దరికీ ఒకేసారి భావప్రాప్తి కలిగింది అని. ఇద్దరికీ ఏకకాలంలో భావప్రాప్తి కలిగినప్పుడే శృంగారంలో అసలైన మజాని ఆశ్వాదిస్తారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.