యాప్నగరం

నేను, మా ఆయన బెడ్రూమ్‌లో ఉన్నప్పుడు.. మా అత్తయ్య..

దంపతుల మధ్య వచ్చే సమస్యలకి నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో తెలుసుకోండి..

Samayam Telugu 19 Dec 2020, 11:55 am
సమస్య: హాయ్.. లాక్ డౌన్ సమయం లో మా అత్తగారు మాతో కలిసి ఉండడానికి వచ్చారు. అప్పటి నుండీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, నేనూ మా వారూ కలిసి గడిపేందుకు ఆవిడ మాకు ఎలాంటి సమయం ఇవ్వడం లేదు. ఆవిడ మా వారి చూటూతానే తిరుగుతూ ఉంటారు, గారబం చేస్తూ ఉంటారు, ఆయనకి ఇష్టమైనవి చేసి పెడుతూ ఉంటారు. ఇదంతా కొంతలో కొంత సర్దుకోవచ్చేమో కానీ, రాత్రి పూట మా బెడ్రూమ్ లోకి వచ్చేసి పడుకుంటారు. ఒక్కరే పడుకోవడానికి ఆవడకి భయమట. ఎవరూ ఇలా ఉండరు కదా, నేనేం చేయాలో నాకు అర్ధం కావటం లేదు. ఆవిడ వచ్చిన తరువాత నేనూ మా వారూ కలిసి టైమ్ స్పెండ్ చేసిందే లేదు. నేను ఈ విషయం లో ఎలా ప్రొసీడ్ అవ్వాలో తోచటం లేదు.
Samayam Telugu asian-couple-have-an-argument-picture-id933442212


నిపుణుల సూచన: అత్తా కోడళ్ళ మధ్య ఉండే బంధం చాలా బలహీనమైనది. వీరిద్దరూ ఒక వ్యక్తి గురించే ఆలోచిస్తారు. ఇద్దరివీ మంచి ఆలోచనలే, ఎవరూ ఇందులో తక్కువ కాదు. ఇలాంటి పరిషితిలో ఈ ఇద్దరి మధ్యా ఆరోగ్యకరమైన అనుబంఢాన్ని మెయింటెయిన్ చేయడం చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఎంత ఇద్దరూ ఒక వ్యక్తి కోసమే ఆరాట పడినా కనిపించని బౌండరీస్ కొన్ని ఉంటాయి. ఆ బౌండరీస్ ని రెస్పెక్ట్ చేయాలి. చేయకపోతే, ఈ ఛాలెంజ్ ఇంకా పెద్దదవుతుంది.

Also Read : వీరికే ఎక్కువగా గుండె కొట్టుకోవడం సడెన్‌గా ఆగిపోతుందట..

లాక్ డౌన్ సమయం లో మీ అత్తగారు మీతో కలిసి ఉండడానికి వచ్చారని నాకు అర్ధమైంది. ఆవిడ మీ వారిని బాగా ప్యాంపర్ చేస్తున్నారనీ, మీ పర్సనల్ స్పేస్ లోకి కూడా వస్తున్నారనీ, రాత్రి మీ గదిలోనే పడుకుంటున్నారనీ కూడా నాకు అర్ధమైంది. ఈ విషయం గురించి మీరు మీ వారితో మాట్లాడారా?

Also Read : గుడ్డు పెంకులని చెట్లకి వేస్తే పెరుగుతాయా..

మీరు ఇంత వరకూ ఆ పని చేసి ఉండక పోతే, వెంటనే ఆయన తో డిస్కస్ చేయండి. మీకు ఆవిండంటే గౌరవమే కానీ, ఆవిడ వచ్చి మీ బెడ్రూమ్ లో పడుకోవడం మీకు కొంచెం అసౌకర్యంగా ఉందని ఆయనకి చెప్పండి. తరువాత, మీ ఇంట్లో అందరూ ఫాలో అయ్యి తీరాల్సిన కొన్ని నియమ నిబంధనలని మీ అత్తగారికి తెలియచేయండి. ఆ తరువాత, ఒక్కరే పడుకోవడానికి ఆవిడకి ఉన్న భయం ఏమిటో కనుక్కోండి. ఆవిడ రూమ్ లో ఒక రోజు ఆవిడ తో పాటూ మీరు పడుకోండి, మరుసటి రోజు మీ వారు పడుకుంటారు ఆవిడకి తోడుగా. ఇలా ఒక అరేంజ్మెంట్ చేసుకోండి, కానీ ఆవిడ తన రూమ్ లోనే పడుకోవాలి. ఇందు వల్ల మీ పర్సనల్ స్పేస్ గురించి ఆవిడకి అర్ధమౌతుంది.

Also Read : బ్రెస్ట్ కాన్సర్ ఎందుకొస్తుంది.. ఎవరికొస్తుంది..

ఆవిడ తన కొడుకుని మిస్ అవుతూ ఉండి ఉండవచ్చు, అందు వల్ల ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు తన ప్రేమనంతా ఆయన మీద కురిపిస్తూ ఉండి ఉండవచ్చు. మీరొక్కరూ ఆవిడకి వ్యతిరేకం గా కాకుండా మీరందరూ కలిసి ఒక టీమ్ గా పని చేస్తే ఈ సమస్యకి సులభంగానే పరిష్కారం లభిస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.