యాప్నగరం

Lazy Husband : నా భర్త నన్ను పనిమనిషిలా చూస్తున్నాడు..

Lazy Husband : భార్యాభర్తల మధ్య కొన్ని సార్లు ఇబ్బందులు వస్తాయి. అవి చిన్నచిన్నవే అయినా పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటి ఓ చిన్న ప్రాబ్లమ్ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టేలా చూస్తోంది. అదేంటో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 12 Apr 2023, 6:18 pm
ప్రశ్న: హాయ్.. నా పేరు మాధవి. నా సమస్య ఏంటంటే.. మా ఆయన అసలు ఇంటి పనుల్లో ఏ సాయం చేయడు. నన్ను ఆయన ఓ పనిమనిషిలా చూస్తున్నాడు. నేను హౌజ్ వైఫ్‌ని. నాకు ఓ పాప ఉంది. అతను ఏ విధమైన హెల్ప్ చేయడు. ఏదైనా అడిగితే ఉద్యోగం చేస్తున్నానంటూ మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి. నాకు ఇబ్బందిగా ఉంటోంది.
Samayam Telugu how to manage a lazy husband
Lazy Husband : నా భర్త నన్ను పనిమనిషిలా చూస్తున్నాడు..


​రిలేషన్ ఎక్స్‌పర్ట్..

హాయ్.. మీ సమస్య గురించి మాకు తెలియజేసినందుకు థాంక్స్. ఏదైనా సరే.. రిలేషన్‌షిప్ అనగానే ఇద్దరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఇవి ఇద్దరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మగవారు. కొంతమంది మగవారు తమ భార్యలపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు.

​ఇన్ని రోజులు భరించినందుకు...

చాలా మంది మగవారిలానే మీ భర్త కూడా చేస్తున్నాడు. ఇన్ని రోజులు తనని భరించినందుకు మిమ్మల్ని నిజంగా అభినందించాల్సిందే. అయితే, ఇకపై అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇక పై మీరు మీ లైఫ్‌ని హ్యాపీగా చేసుకోవచ్చు.
Also Read : Romance : మగవారు ఆ వీడియోలు ఎందుకు ఎక్కువగా చూస్తారంటే..

​సమస్య దూరమయ్యేందుకు..​

మీరు మీ భర్త ప్రవర్తనతో ఎంత విసిగిపోయారో తనకి అర్థమయ్యేలా చెప్పండి. మీకు చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేయండి. మీకు కూడా విశ్రాంతి కావాలని తనని అడగండి. శాంతంగా కూర్చొని సమస్య గురించి తనికి చెప్పండి. దీనిని మీరు చాలా రోజులుగా ఫేస్ చేస్తున్నానని దాంతో మీరు ఏం కోల్పోయారో తనకి తెలియజేయండి.

​ఒప్పుకోకపోతే..

తనకి సమస్యని అర్థమయ్యేలా చెప్పండి. ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల మీ అన్యోన్యత పెరుగుతుందని మీకు విసుగు ఉండదని చెప్పండి. బద్ధకం వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలియజేయండి.
Also Read : Romance Facts : వీటిని తిని శృంగారం చేస్తే ఆ ఆనందమే వేరు..

​కావాలంటే పరోక్షంగా..

తను నేరుగా మీకు హెల్ప్ చేయడం ఇష్టం లేకపోయినా బయటి నుంచి సరుకులు తీసుకురావడం, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం వంటివి చేయమని చెప్పండి. ఏదో తప్పు చేసినట్లుగా కాకుండా సరదాగా నవ్వుతూ సమస్య, సమస్యకి పరిష్కారం ఏంటో కనుక్కోని ఆ విధంగా చేయండి.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.