యాప్నగరం

కాలి బొటన వేలితో అంగస్తంభన సమస్యను గుర్తించవచ్చా?

మీకు తెలుసా? అంగస్తంభన సమస్యలను కాలి బొటన వేలు ముందుగానే సూచిస్తుంది. అదెలాగో చూడండి.

Samayam Telugu 10 Jul 2020, 8:50 pm
పురుషుల్లో అంగ స్తంభన సమస్య సర్వ సాధారణమే. దీనివల్ల పురుషుల్లో సెక్స్ లైఫ్‌ మీద ఉండే ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది. బిజీ లైఫ్, ఆఫీసులో పని ఒత్తిడి, క్రమరహితమైన లైఫ్‌స్టైల్ వల్ల అత్యధిక పురుషులను ఈ సమస్య వేధిస్తోంది. అయితే, దీని గురించి పెద్దగా వర్రీ కావల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ సమస్యను కాలి బొటన వేలిని చూసి గుర్తించవచ్చట. పురుషులపై సుమారు పదేళ్లపాటు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసిందట.
Samayam Telugu కాలి బొటన వేలితో అంగస్తంభన సమస్యను గుర్తించవచ్చా?


ఎలా గుర్తిస్తారు?:
అర్థరైటిస్ వల్ల బొటన వేలు నొప్పి కలుగుతున్నట్లయితే.. అంగస్తంభన సమస్య పొంచి ఉన్నట్లు గుర్తించాలని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ పురుషులతో పోల్చితే.. అర్థరైటిస్ సమస్య కలిగిన 31 శాతం మంది మగాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

Also Read: ఒకే పెళ్లిలో ఇద్దరికి తాళి కట్టిన వరుడు.. ఒకరు ప్రియురాలు, మరొకరు..

గౌట్ వ్యాధి ఉన్నవారికి కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అయితే, ఈ నొప్పుల కంటే ముందే వారిలో అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో యూరిక్ ఆమ్లం (యూరిక్ యాసిడ్) ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల నొప్పితో కూడిన ఆర్థరైటిస్ వస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీన్నే హైపర్‌ యూరిసెమియా అని అంటారు.

Also Read: జాజికాయతో అద్భుత ప్రయోజనాలు.. పడక గదిలో ప్రతిరోజూ పండగే! కానీ...

ఆర్థరైటిస్ నొప్పి వల్ల చాలమందికి నిద్రపట్టదు. చివుక్కుమనే నొప్పి వల్ల అర్థరాత్రులు నిద్రలేస్తారు. నొప్పి సమయంలో బొటన వేలు ఎర్రగా మారిపోవడంతోపాటు వెచ్చగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంగం స్తంభించాలంటే.. రక్త సరఫరా సక్రమంగా ఉండాలి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నట్లయితే.. రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడి అంగస్తంభన సక్రమంగా జరగదు. ఇకపై మీకు బొటన వేలు నొప్పిగా ఉన్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. సమస్యను ఆదిలోనే అంతం చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.