యాప్నగరం

అన్నయ్యే చెల్లెలిని హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకుంటే ఏం చేయాలి..

తన భర్త చెల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ చెబుతున్న మహిళకు ఎక్స్ పర్ట్స్ ఎలాంటి సలహా ఇస్తుందో తెలుసుకోండి..

Samayam Telugu 20 Jul 2020, 7:43 pm
సమస్య : హాయ్... నేను ఎంతో ఆలోచన తరువాత మీ సలహా కోరుతున్నాను. నేను ఎదుర్కొంటున్న సమస్య కొంచెం తేడా గా ఉంటుంది. దాని వల్ల నేను చాలా క్షోభ అనుభవిస్తున్నాను. నేను వివాహితను. కానీ, నా పెళ్ళి అయిన తరువాత నేను గమనించింది ఏమిటంటే మా వారూ, మా ఆడ పడుచూ చాలా క్లోజ్ గా ఉంటారు. అన్నా చెల్లెళ్ళు క్లోజ్ గా ఉండడంలో తప్పేమీ లేదు. కానీ, వీళ్ళ ప్రవర్తన మరీ మితిమీరి పోయి ఉంటుంది. చనువుగా ఉండడంతో పాటూ ఒకరినొకరు ఆనుకుని కూర్చోడం, హత్తుకోవడం చేస్తూ ఉంటారు. నా ముందే ఒకళ్ళ ముఖం మీద ఇంకొకళ్ళు ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఎంత అన్నా చెళ్ళెల్లైనా ఇలాంటి చనువు కొంచెం ఇబ్బంది కరంగా ఉంటుంది కదా. ఇదంతా చూడడం, అర్ధం చేసుకోవడం నాకు కొంచెం కష్టం గా ఉంది. పోనీ, నా వైవాహిక జీవితం ఏమైనా సంతృప్తికరంగా ఉందా అంటే అదీ లేదు. నా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టు నాతో ఉండరు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా విపరీతంగా ఉంటుంది నా భర్త ప్రవర్తన. పూర్తిగా నన్ను ఎవాయిడ్ చేస్తారు. నా వైపు చూడడం, మాట్లాడడం కూడా తప్పు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. అతని ఫ్యామిలీ గురించీ, అతని చెల్లెలి ప్రవర్తన గురించీ, నా ఇన్సెక్యూరిటీస్ గురించీ నేను చాలా సార్లు నా భర్త తో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ, ప్రతి సారీ ఆ డిస్కషన్ అపార్ధాలతోనే ముగుస్తోంది. ఈ పరిస్థితి నాకు చాలా డిప్రెసింగ్ గా అనిపిస్తోంది. ఏం చేయాలో, ఈ సమస్య నించి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు.
Samayam Telugu unhappy-married-couple-after-cheating-at-home-picture-id1063392848


Also Read : దేవుడి ఫొటోలు బెడ్‌రూమ్‌లో పెట్టొచ్చా..

సలహా : ఒకరి కష్టసుఖాలని ఒకరు అర్ధం చేసుకుంటూ, ఒకరి ఇష్టాయిష్టాలని ఒకరు గౌరవించుకుంటూ చేసే ప్రయాణమే వివాహం. ఇద్దరూ చెరో కుటుంబం నుంచి, చెరో పెంపకం నుంచి వస్తారు కాబట్టి ఇది కొద్దిగా కష్టమే. కానీ, మనిషి వ్యక్తిత్వానికి పునాది అయిన నమ్మకాలూ, విలువలూ ఒకటే అయినప్పుడు చెరొక వైపు నుంచి ఇద్దరూ ఒకే వైపుకు రావడం పెద్ద కష్టం కాదు. కానీ, ఇద్దరూ దీని కోసం ఆరాటపడితేనే ఇది జరుగుతుంది. అంతే కాకుండా ఈ అడ్జస్ట్‌మెంట్ అనేది జీవితాంతం కొనసాగాల్సిన ప్రక్రియ.

Also Read: ఆ పిల్లి వల్లే నా భార్యకు గర్భం.. భర్త ఆరోపణ, ఔను.. ఇది నిజం!

మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైనదే. మీరు మీ బాధని పంచుకోడానికి ముందుకొచ్చినందుకు అభినందనలు. మీ ఆడపడుచూ మీ వారూ చాలా క్లోజ్‌గా ఉండడం, వారి మితిమీరిన ప్రవర్తన మీకు నచ్చటంలేదని నాకు అర్ధమైంది. అలాగే, మీ వారు మీతో ఒకలా, అతని ఫ్యామిలీ మెంబర్స్ తో ఒకలా బిహేవ్ చేస్తున్నారనీ, మీ వైవాహిక జీవితం గురించి కూడా మీరు ఆనందంగా లేరని, మీ భర్తతో ఈ విషయాలు డిస్కస్ చేయడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయిందని కూడా నేను అర్ధం చేసుకున్నాను. ఈ సిచ్యుయేషన్ మీకు డిప్రెసింగ్‌గా అనిపించడం సహజమే.

Also Read : జీలకర్ర, వాము వాటర్ తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా..

ముందుగా, మీరు కొంత టైం తీసుకుని మీ లైఫ్ గురించి మీకు ఎలాంటి ఆశలూ కోరికలూ ఉన్నాయో క్లియర్ గా ఆలోచించుకోండి. మీకు నచ్చిన, మీకు ఇష్టమైన పనులు చేయడం కోసం కొంత సమయం కేటాయించుకోండి. తరువాత, మీ హస్బెండ్ తో ఈ విషయాలు మాట్లాడేటప్పుడు వారి ప్రవర్తన కాకుండా మీ ఫీలింగ్స్ గురించి చెప్పండి. ఉదాహరణకి, మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని కాకుండా నన్ను పట్టించుకోవట్లేదని నాకు అనిపిస్తోంది. ఇలా చెప్పండి. అలాగే, మీ ఇద్దరూ కూడా లైఫ్‌లో మీ ఇద్దరికీ ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏమిటో అవి తీర్చుకోడానికి ఒకరి సహకారం ఇంకొకరికి ఎలా అవసరమో తెలియచెప్పుకోండి.

Also Read : జూలైలో ఏ పండ్లు, కూరగాయలు తింటే మంచిది.. ఏయే నెలల్లో ఏమేం తినాలంటే..

మీరు ఒక కౌన్సెలింగ్ సైకాలజిస్ట్‌ని కలవడం గురించి కూడా ఆలోచించొచ్చు. వారు మీరు ఫేస్ చేస్తున్న ఇన్‌సెక్యూరిటీస్ నుంచి బయట పడడానికి హెల్ప్ చేస్తారు. ఆ తరువాత కావాలంటే మారేజ్ కౌన్సిలర్‌ని కలవడం కూడా కన్సిడర్ చేయవచ్చు. మీ వైవాహిక బంధాన్ని మెరుగు పరుచుకోవడానికి వారు సహాయం చేస్తారు. ఆల్ ద బెస్ట్.

Read in English : My sister-in-law's proximity with my husband makes me uncomfortable

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.