యాప్నగరం

Relationship: నా లైఫ్‌లో.. మా అత్తమామల జోక్యం ఎక్కువైంది

Relationship: మా అత్తమామలు.. మా ఇంటి విషయాల్లో కలుగజేసుకుంటున్నారు. మా నెలవారి ఖర్చులు, మేము వేసుకునే బట్టలు, తినే తిండి అన్ని విషయాలలోనూ జోక్యం చేసుకుంటున్నారు. నాకు వారి ప్రవర్తన నచ్చడం లేదు. నేనేం చేయాలి..?

Edited byరాజీవ్ శరణ్య | Samayam Telugu 20 Apr 2023, 4:14 pm
Relationship: మాది మధ్యతరగతి కుటుంబం. పెళ్లి కాకముందే నా భార్యకు, ఆమె తల్లిదండ్రులకు మా కుటుంబ పరిస్థితుల గురించి తెలుసు తెలుసు. నా భార్య వాళ్లది ఎగువ మధ్యతరగతి కుంటుంబం. అయినా కానీ, పెళ్లి తర్వాత ఆమెలో ఎలాంటి మార్పు లేదు, నాపైనా ఎలాంటి నిబంధనలు పెట్టలేదు, నాతో తన హ్యాపీగానే ఉంటోంది. అయితే పెళ్లయిన తర్వాత అత్తమామలు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. మా నెలవారీ ఇంటి ఖర్చుల నుంచి మేము తినే, తాగే ప్రతిదాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మా తల్లిదండ్రులు వేరే రాష్ట్రంలో ఉంటారు. వాళ్లు మాకు స్పేస్‌ ఇవ్వడానికి మమ్మల్ని ఫ్రీగా వదిలేశారు. వాళ్ల తల్లిదండ్రులను హ్యాండిల్‌ చేయమని నేను, నా భార్యను అడిగాను. కానీ వారి ప్రవర్తనను ఆమె ప్రేమ అనుకుంటుంది. ఇది కొన్నిసార్లు అవమానకరంగా ఉంటుంది. వాళ్లని కలవడానికి, వారితో మాట్లాడటానికి నాకు ఇష్టం ఉండటం లేదు. నేనేం చేయాలి..?
Samayam Telugu relationship

ఫ్రెడిక్షన్‌ ఫర్‌ సక్సెస్‌ ఫౌండర్‌, రిలేషన్‌ షిప్ కోచ్‌ విశాల్ భరద్వాజ్ దీనికి సమాధానం ఇచ్చారు. మనకు పర్సనల్‌ స్పేస్‌ అనేది చాలా అవసరం. లైఫ్‌ జర్నీ ప్రారంభించే కొత్త జంటలకు.. జీవితంలో కొత్త జంటలకుమార్గదర్శకత్వం అవసరం. కానీ, అది కొన్ని సాధారణ ఆర్థిక విషయాలు, జీవిత అంశాలకు పరిమితం కావాలి. మీరు ఎలాంటి సలహాలు అడగకుండా.. మీ తల్లిదండ్రుల జోక్యం మీ వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా ఉంటే వారితో మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో ఆనందాన్ని పాడు చేస్తుంటే.. హద్దులను పటిష్టంగా గీయాలి.
పర్సనల్‌ స్పేస్‌ ఇంపార్టెన్స్‌ గురించి మాకు తెలుసు. మీ అత్తమామలు.. మీ కంఫర్ట్‌ గురించి ఆలోచించకుండా మీ వ్యక్తిగత జీవితంలో జీవితంలో జోక్యం చేసుకోవడం మీకు అసౌకర్యంగానే ఉంటుంది. మీ భార్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి. ఆమె ఈ పరిస్థితిని మ్యానేజ్‌ చేస్తుందని నమ్మండి. మీ ఆందోళన గురించి ఆమెకు వివరించండి, ఈ విషయంలో బాధ్యత వహించమని తనను అడగండి. ఆమె మీకు, మీ అత్తమామలకు ఇబ్బంది కలగకుండా.. వారి అర్థం అయ్యేలా ఈ విషయం చెబుతుంది. ఇది మీ సామరస్యాన్ని, సరిహద్దులను కాపాడుతుంది. ఆమె తన తల్లిదండ్రులను ప్రశ్నించడం అంత సులభం కాదు, కాని తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి అలా చేయాల్సిందే.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.