యాప్నగరం

Relationship: నా సక్సెస్‌ కారణంగా.. నా భర్త అప్సెట్‌ అయ్యాడు..!

Relationship: నేను బిజినెస్‌ ప్రారంభించాడినికి నా భర్త నన్ను ఎంతగానో ఎంకరేజ్‌ చేశాడు. కానీ, ఇప్పుడు నేను బిజినెజ్‌ విషయాల్లో బిజి అవుతుంటే.. అతనికి నచ్చడం లేదు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 28 Mar 2023, 4:46 pm
Relationship: నేను బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి, నా భర్త నన్ను చాలా ఎంకరేజ్‌ చేశాడు. అతని లాంటి భర్త దొరకడం నా అదృష్టం అని మా బంధువులు, ఫ్రెండ్స్‌ ఎంతో మెచ్చుకున్నారు. పస్తుతం నా బిజినెస్‌ చాలా బాగా డెవలప్‌ అయ్యింది, దీంతో నాకు పార్టీలకు ఎక్కువగా ఆహ్వానాలు వస్తున్నాయి. ఇది నా భార్తకు నచ్చడం లేదు. నా భర్తతే, నా కూతురితో గడపడానికి కూడా టైమ్‌ ఉండటం లేదు. ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. వీటన్నింటినీ ఎలా హ్యాండిల్‌ చేయాలో నాకు అర్థం కావడం లేదు.
Samayam Telugu husband upset with wife success for not giving enough time to him
Relationship: నా సక్సెస్‌ కారణంగా.. నా భర్త అప్సెట్‌ అయ్యాడు..!

డాక్టర్ చాందిని తుగ్నైట్ దీనికి సమాధానం ఇచ్చారు. ఇంటినీ, బిజినెస్‌ను ఎలా మ్యానేజ్‌ చేయాలో మీకు గందరగోళంగా ఉందని నాకు అర్థం అయ్యింది. మీ పార్టనర్‌తో మంచి రిలేషన్‌ కొనసాగిస్తూ.. బిజినెస్‌ చేయడం, బ్యాలెన్స్‌ కష్టం అనే చెప్పాలి. మీ భర్త మిమ్మల్ని సపోర్ట్ చేయడం గొప్ప విషయమే అయినా, ఇప్పుడు మీ వ్యాపారం పుంజుకుంటున్నందున అతను దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

మీ ఇద్దరు వ్యక్తిగత జీవితాల్లో, ఇద్దరూ ఎలా సపోర్ట్‌ ఇచ్చుకోగలరో కూర్చుని మాట్లాడుకోవడం మంచిది. ప్రతి రోజూ మీ భర్తకు, కుమార్తెకు కొంత సమయం ఇవ్వండి, రోజుకు కొంత సమయాన్ని నిర్ణయించుకోండి. వీకెండ్స్‌ కచ్చితంగా వారితో గడిపేలా ప్లాన్‌ చేసుకోండి. మీ భర్తను వీలైనంత వరకు మీ బిజినెస్‌లో ఇన్వాల్వ్‌ చేసుకోండి. బిజినెస్‌ గ్రోత్‌కు అతని సలహాలు అడగండి, బిజినెస్‌ ఇవెంట్స్‌కు అతన్ని రమ్మనండి. మీరు ఇద్దరూ కలిసి పని చేయండి. ఇలా చేస్తే.. మీ భర్తుకు విలువ ఇచ్చినట్లవుతుంది, అలాగే సమయం కూడా. ఇలా చేస్తే అతని కోసం, ఈర్ష్య కొంత తగ్గుతాయి.
బిజినెస్‌లో విజయం సాధించడానికి, మద్దతు చాలా అవసరం. అయినప్పటికీ.. మీ వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక రిలేషన్‌లో పార్టనర్స్‌ ఇద్దరూ వారి అవసరాలను, ఆందోళనలను ఒకరికొకరితో షేర్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఎక్కువ సమయం బిజినెస్‌కు కేటాయిస్తున్నారని, మీ భర్త ఫీల్‌ అవుతుంటే.. అతనితో మాట్లాడండి. మీ ఫ్యామిలీ, బిజినెస్‌కు సమయాన్ని సమతల్యం చేయాడనికి ఒక మార్గం కనుక్కోండి. మీరు కొన్ని రూల్స్‌ పెట్టుకుంటే.. మీ భర్త, కూతురితో కొంత సమయం గడపడానికి కుదురుతుంది.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.