యాప్నగరం

సెక్స్ వల్ ఫ్యాంటసీలతో సతమవుతున్నా

నేను 18 సంవత్సరాల అబ్బాయిని. ప్రస్తుతం ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాను. ప్రతి రోజు నేను బాగా చదవాలని ప్రయత్నిస్తా. అయితే కొన్ని సెక్స్ వల్ ఫాంటసీలు నా మైండ్ లో కదలాడుతూ ఉంటాయి.

TNN 29 Sep 2016, 2:02 am
ప్రశ్న: నేను 18 సంవత్సరాల అబ్బాయిని. ప్రస్తుతం ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాను. ప్రతి రోజు నేను బాగా చదవాలని ప్రయత్నిస్తా. అయితే కొన్ని సెక్స్ వల్ ఫాంటసీలు నా మైండ్ లో కదలాడుతూ ఉంటాయి. దీంతో రోజూ నేను ఒకట్రెండు గంటల టైం వేస్ట్ చేస్తుంటాను. నా బోర్డు ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. నా భవిష్యత్ ఏమవుతుందోనని నేను ఆందోళన చెందుతున్నాను. లేదు. నేనేం ఏం చేయాలో కాస్త సలహా ఇవ్వండి. (ప్రశ్న అడిగిన వారి వివరాలు లేవు)
Samayam Telugu i am 18 and hijacked by sexual fantasies
సెక్స్ వల్ ఫ్యాంటసీలతో సతమవుతున్నా


డాక్టర్ అతుల్ అశ్వని జవాబు: హలో 18 ఇయర్స్ ఓల్డ్ బాయ్.. టీనేజీలో ఉన్నప్పుడు ఇలాంటి సెక్స్ వల్ ఫాంటసీలు ఎక్కువగా రావడం చాలా సాధారణమైన విషయం. ప్రస్తుతం నీ శరీరంలోని హార్మోన్ల ప్రభావమే ఇందుకు కారణం. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీవు చదువుకునేటప్పుడు ఒక్కడివేకాకుండా నీ ఫ్రెండ్స్ తో కలిసి చదువుకో. మధ్యమధ్యలో రాస్తూ ఉండడం, బొమ్మలు గీయడం, ఫ్లోచార్స్ తయారు చేయడంలాంటి పనులు చేస్తూ ఉండు. రాయడం వల్ల నీకు వచ్చే ఇతర ఆలోచనలు తగ్గిపోతాయి. దీంతో తర్వాత నీవు చదువుపై ఏకాగ్రత సాధించవచ్చు. నీకు ఏదైనా అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయంటే వెంటనే నీవు కూర్చొన్న చోటు నుంచి లేచి కాసేపు అటు ఇటు వాకింగ్ చెయి. అలాగే ఎక్సర్ సైజులు చేయడం వల్ల కూడా కొన్ని అసవసర ఆలోచనల నుంచి బయటపడొచ్చు. అందువల్ల నీవు చదవడం ప్రారంభించడానికి ముందు ఒక 15 నిమిషాల సేపు వర్కవుట్స్ చెయి. ఇవన్నీ నీవు డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు ఉపయోగపతాయి. ఆల్ ది బెస్ట్.
- డాక్టర్ అతుల్ అశ్వని, సైకియాట్రిస్ట్, కౌన్సిలర్, ముంబై

I am 18 and hijacked by sexual fantasies!
Question: I am 18-years-old and studying in class XII. Every day I try to study hard but some sexual fantasies come into my mind and I end up wasting 1-2 hours daily. My board exams are approaching fast and I am worried about my future. What should I do?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.