యాప్నగరం

‘మా బంధువుల్లో ఓ అబ్బాయిని ప్రేమించా.. కానీ, అతడు నాకు అన్నయ్య...’

ఆమె తన తండ్రి వదిన.. (పెద్దమ్మ) కొడుకు ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఆమె పడుతున్న మనో వేదనను లేఖ ద్వారా తెలియజేసింది.

Samayam Telugu 21 Nov 2020, 6:07 pm
సమస్య: నేను మా బంధువుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ప్రేమిస్తున్నా. అతడి తల్లి.. మా నాన్నకు వదిన అవుతుంది. ఆ బంధుత్వం ప్రకారం.. అతడు నాకు అన్నయ్య అవుతాడు. అందుకే, ఇప్పటివరకు అతడికి నా ప్రేమ గురించి చెప్పలేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి మంచి సలహా చెప్పగలరు. ఆ ఆలోచనలతో నేను సరిగా పని మీద దృష్టి పెట్టలేకపోతున్నా. చాలా గందరగోళంగా ఉంది.
Samayam Telugu Love Problems

- ఓ సోదరి (ప్రైవసీ నిమిత్తం పేరు గోప్యంగా ఉంచాం)

సమాధానం: మీరు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. మీ ఫీలింగ్‌ను మేం అర్థం చేసుకున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. ఏ మాత్రం తొందరపడినా అది మీ కుటుంబాన్ని డిస్ట్రబ్ చేస్తుంది. అయితే, మీరు ముందుగా మీ కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాల్లో సానుకూలంగా ఉంటారా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. వీలైతే మీ ప్రేమను ఆ వ్యక్తికి తెలియజేసి చూడండి. అతడు కూడా మీ మీద ప్రేమను వ్యక్తం చేస్తే.. మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. ఒక వేళ అతడు మీ ప్రేమను అంగీకరించకపోయినా, తమ తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పినా.. వెనక్కి తగ్గడం ఒక్కటే ఉత్తమమైన మార్గం.

Read Also: ‘నా భార్యంటే ఇష్టమే.. కానీ, ఆమెను చూస్తుంటే మూడ్ రావడం లేదు’

ఒక వేళ మీరు ఆ వ్యక్తిని మరిచపోలేకపోతే.. అతడికి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. అయితే, అతడితో ఉన్న బంధాన్ని మీరు పాడుచేసుకోవద్దు. ఈ సమస్య మీ పనులపై ప్రభావం చూపకుండా జాగ్రత్తపడండి. ఇది పరిష్కారం కావడానికి కొంత సమయం పడుతుంది. దీని వల్ల మీరు మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉండవచ్చు. కుటుంబంలో స్పర్థలకు దారితీయొచ్చు. కాబట్టి.. మీ జీవితం సాఫీగా సాగే నిర్ణయాన్ని తీసుకోండి. వీలైతే మీ దగ్గర్లోని కౌన్సిలర్‌ను సంప్రదించండి. వారి వద్ద మీకు సంబంధించిన అన్నీ విషయాలు వెల్లడించి తగిన పరిష్కారాన్ని పొందవచ్చు.

Read Also: ఇవి తింటే.. సెక్స్‌లో మీరే కింగ్, వయాగ్రా కూడా వేస్ట్!

సలహా ఇచ్చిన వారు: కామ్నా చిబ్బెర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ హెడ్, ఫోర్టీస్ హెల్త్ కేర్

(‘టైమ్స్ ఆఫ్ ఇండియా - లైఫ్ స్టైల్’ సౌజన్యంతో..)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.