యాప్నగరం

‘నేను నా సహోద్యోగిని ప్రేమిస్తున్నా.. కానీ, #MeToo కింద ఆమె..’

అతడు తన ఆఫీసులో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ, ఆమెకు ఆ విషయం చెబితే మేనేజర్‌కు చెప్పేస్తుందేమోనని భయపడుతున్నాడు. ఈ సందర్భంగా అతడు తన సమస్యను ఇలా వివరించాడు.

Samayam Telugu 25 May 2021, 9:46 pm
సమస్య: నేను నా సహోద్యొగిని ప్రేమిస్తున్నా. కానీ, #MeToo వల్ల ఆఫీసులో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. ఒక వేళ నేను ప్రపోజ్ చేస్తే ఆమె కూడా #MeToo కింద నా గురించి చెబుతుందనే ఆందోళన వెంటాడుతోంది. ఆమె నా టీమ్‌మేట్. ఆమెకు నా ప్రేమను వ్యక్తం చేసి రిలేషన్‌షిప్‌లో ఉండాలని ఉంది. కానీ, ఆమె ఎలా స్పందిస్తుందోనని భయపడుతున్నా. ఒక వేళ ఆమె ఈ మేటర్‌ను మేనేజర్ వరకు తీసుకెళ్తే నా భవిష్యత్తు ఏమిటీ? దయచేసి సరైన సలహా ఇవ్వగలరు.
Samayam Telugu Representational Image

- ఓ సోదరుడు (ప్రైవసీ నిమిత్తం పేరు గోప్యంగా ఉంచాం)

సమాధానం: #MeToo అనేది ఒకప్పుడు. మీరు దాని గురించి ఆలోచించవద్దు. అందులో ఎక్కువ మంది తమను వేదించే వ్యక్తుల గురించే చెప్పారుగానీ.. ప్రేమించే వ్యక్తుల గురించి కాదు. తోటి మహిళ ఉద్యోగులతో గౌరవంగా మెలగాలని చట్టాలు చెబుతున్న నేపథ్యంలో మీరు వారితో చనువుగా మాట్లాండేందుకు భయపడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ భయం మీలోనే కాదు చాలామంది పురుషుల్లో ఉంటుంది. మీరు వెంటనే ఒక కౌన్సలర్‌ను కలుసుకుని మీలో ఉన్న ఆందోళనను పోగొట్టుకోండి.

Read Also: ‘నేను వేరే కులం అబ్బాయిని ప్రేమించాను.. కానీ, నా తల్లిదండ్రులు..’

మీరు నేరుగా ఆమెకు ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించకండి. ముందు ఆమెతో మాటలు కలిపి స్నేహం చేయండి. ఒకసారి మీ మధ్య చనువు పెరిగితే.. మీ మనసులో మాటను ఎలాంటి భయాందోళనలు లేకుండా చెప్పేయవచ్చు. ఆమెకు ఇష్టం ఉంటే మీ ప్రేమను అంగీకరిస్తుంది. లేదంటే సున్నితంగా తిరస్కరిస్తుంది. స్నేహం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకొనే అవకాశం లభిస్తుంది. సానుకూల వాతావరణం కల్పిస్తుంది. ఒక వేళ ఆమె మీ ప్రేమను తిరస్కరిస్తే.. దాన్ని తట్టుకోగలిగే శక్తి కూడా మీలో ఉండాలి. కాబట్టి.. ముందుగానే సిద్ధంగా ఉండండి.

Read Also: ‘నా ప్రియుడు ఆ వీడియోలు చూసిన తర్వాతే బెడ్‌రూమ్‌లో..’

- రచనా అవత్రామణి, కౌన్సలింగ్ సైకాలజిస్ట్, ముంబయి

(టైమ్స్ ఆఫ్ ఇండియా/లైఫ్‌స్టైల్/ఆస్క్ ది ఎక్స్‌పర్ట్ నుంచి సేకరణ)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.