యాప్నగరం

‘నాకు పెళ్లయ్యింది.. కానీ, వేరే అమ్మాయిలతో...’

అతడికి పెళ్లయ్యింది. కానీ, అతడు వేరే అమ్మాయిలను కలుస్తున్నాడు. అది అతడికి దురలవాటుగా మారింది. ఈ సందర్భంగా అతడు తన సమస్యకు పరిష్కారం కోరుతున్నాడు.

Samayam Telugu 21 Jan 2021, 10:45 pm
సమస్య: నాకు 26 ఏళ్లు. ఏడాది కిందటే పెళ్లి చేసుకున్నాను. కానీ, నేను ఇతర అమ్మాయిలను చూస్తుంటే ఆగలేకపోతున్నా. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ సమస్య శారీరక సంబంధాలకు కూడా దారితీస్తోంది. దీని నుంచి బయటపడేందుకు నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ, ఫలితం ఉండటం లేదు. ఈ పాడు అలవాటును ఎలా వదిలించుకోవాలి? ఇప్పుడు నా భార్య గర్భవతి. ఈ చెడు అలవాటును వదిలించుకుని మంచి జీవితాన్ని పొందాలని అనుకుంటున్నా. నేను లైంగిక ఆనందానికి బానిస అయ్యానేమో అని భయం వేస్తోంది. నేను ఏం చేయాలి? దయచేసి మంచి సలహా ఇవ్వండి.
Samayam Telugu Representational image


సమాధానం: స్త్రీ పురుషుల కలయిక అనేది ప్రాథమిక అవసరం. అలాగే తప్పులు చేయడం కూడా మానవ సహజమే. అయితే, వాటి నుంచి గుణపాఠం నేర్చుకుని మార్పు దిశగా అడుగులు వేస్తేనే సంతోషం సొంతమవుతుంది. భార్యతో మీకు ఏమైనా సమస్యల ఉన్నాయా? అవే మీమ్మల్ని ఇతర అమ్మాయిల వైపు ప్రేరేపిస్తున్నాయా? ఒకవేళ మీకు ఆమెతో ఏ సమస్యలున్నా.. బయటి వ్యక్తులతో శరీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలే కాదు, కుటుంబ సమస్యలు కూడా వస్తాయి. పైగా మీరు ఇప్పుడు తండ్రి కాబోతున్నారు. త్వరలో బాధ్యతలు పెరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఆ అలవాటు నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం మంచి నిర్ణయమే.
‘నాది ప్రేమ పెళ్లి.. నా మాజీ ప్రేయసిని కూడా పెళ్లాడాలని ఉంది’మీరు మీ బిడ్డకు రోల్ మోడల్‌గా ఉండాలి. మీ భార్య కూడా మీలాగే వివాహేతర సంబంధానికి పాల్పడితే మీరు ఆమెను క్షమించగలరా? ఒక్కసారి మీ భవిష్యత్తు గురించి, మిమ్మల్ని నమ్ముకుని మీతో వచ్చిన భార్య, బిడ్డల గురించి ఆలోచించండి. మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. ఆ తప్పు చేయాలనే భవన కలిగినప్పుడల్లా ఈ విషయాలు గుర్తుంచుకోండి. స్వీయ నియంత్రణ కోల్పోవద్దు. ఆమె గర్భవతిగా ఉందనే ఉద్దేశంతో మీరు మళ్లీ అటువైపు అడుగులు వేసే ప్రయత్నాలు చేయొద్దు. మీకు ఆలోచనలు కలిగితే.. స్వయంగా తృప్తి పొందేందుకు ప్రయత్నించండి. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే మానసిక వైద్యుడిని సంప్రదించండి.
‘టైలర్‌కు దగ్గరయ్యా.. ఇప్పుడు నేను గర్భవతి, నా భర్తకు నిజం చెప్పేశా, కానీ..’
సలహా ఇచ్చినవారు: డాక్టర్ రితికా శ్రీవాస్తవ, YourDOST.comలో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్

(సేకరణ: టైమ్స్ ఆఫ్ ఇండియా - లైఫ్‌స్టైల్)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.