యాప్నగరం

ఐదేళ్లుగా సహజీవనం కానీ.. ప్రేమ లేదు..?

మొదటి నుంచి అతనితో ఎప్పటికప్పుడు విడిపోవాలని నేను బలంగా కోరుకుంటున్నాను. కానీ..ఏదో ఒక కారణంతో

TNN 26 Jun 2017, 10:00 pm
ప్రశ్న: నా వయసు 25 ఏళ్లు. నా క్లాస్‌మెట్‌తో ఐదేళ్ల నుంచి సన్నిహితంగా ఉంటున్నాను. కానీ.. అతడ్ని ఇప్పటి వరకు నేను ప్రేమించలేదు. ఎందుకంటే మొదటి నుంచి అతనితో ఎప్పటికప్పుడు విడిపోవాలని నేను బలంగా కోరుకుంటున్నాను. కానీ..ఏదో ఒక కారణంతో మళ్లీ మేము ఒకటవుతున్నాం. అయితే ఈ ఐదేళ్లలో ఇప్పటి వరకు మా మధ్య శారీరక సంబంధం ఏర్పడలేదు. అతని వ్యవహార తీరు, శుభ్రత లేకపోవడంతో నేను సెక్స్‌కి అంగీకరించలేకపోయాను. కానీ కొన్ని సందర్భాల్లో అతను ఫోన్ సెక్స్, అశ్లీల వీడియోలను చూడమంటూ నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. ఒకప్పుడు అతను బాధల్లో ఉన్నాడని సన్నిహితంగా మెలిగాను.. దాన్ని ప్రేమ అనుకున్న అతను ఇప్పుడు సీరియస్‌గా నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ.. అతనిపై నాకు ప్రేమ లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు..? అతని ప్రేమని అంగీకరించి అతనితో ఉండిపోమంటారా..? లేదా విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకోమంటారా..? సలహా ఇవ్వగలరు- ఓ సోదరి
Samayam Telugu i am physically intimate with my boyfriend but i dont love him
ఐదేళ్లుగా సహజీవనం కానీ.. ప్రేమ లేదు..?


జవాబు: అబ్బాయి, అమ్మాయి మధ్య సన్నిహిత సంబంధాలు అనేవి పజిల్ లాంటివి. క్లారిటీ లేకపోతే ఆ పజిల్ ఎప్పటికీ అసంపూర్తిగానే ఉంటుంది. మీరు మొదటి నుంచి అతనితో విడిపోవాలనే తలంపుతోనే ఉన్నా.. ఐదేళ్ల పాటు బంధాన్ని కొనసాగించారు. ఇప్పుడు అతను సీరియస్‌గా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కనీసం ఇప్పుడైనా మీరు మేల్కొన్నారు. సరే.. అతనితో మీరు విడిపోవాలని భావిస్తే.. తర్వాత మీ జీవితంలోకి రాబోయే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలనే దానిపై మీకు స్పష్టత ఉందా..? దీనికి మీరు సమాధానం చెప్పేటప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తి‌తో వాటిని పోల్చుకోండి. కచ్చితంగా చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా తేడాలుండవు. ఎందుకంటే ఐదేళ్లు మీరు అతనితో కలిసి ఉన్నారంటే.. మీకు నచ్చిన లక్షణాలు కొన్ని అయినా.. అతనిలో తప్పకుండా ఉండితీరాలి. కాబట్టి.. విడిపోవడానికి కారణాలు వెతక్కుండా.. కలిసుండటానికి మార్గాలేమైనా ఉన్నాయోమో ఆలోచించండి.

సలహా ఇచ్చినవారు అతుల్య నాయర్, కౌన్సిలర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.