యాప్నగరం

లేడీ బాస్ కొడుతుంటే.. నాలో ఏదో ఫీలింగ్!

నా బాస్ వయసు 35 ఏళ్లు. చాలా అందంగా ఉంటుంది. ఆమె చాలా స్ట్రిక్ట్. స్కూల్ టీచర్‌లా కఠినంగా వ్యవహరిస్తుంది.

TNN 12 Apr 2017, 6:45 pm
ప్రశ్న: నేను ఈ మధ్యే ఓ ఉద్యోగంలో చేరాను. ఇది నా మొదటి జాబ్. నా బాస్ వయసు 35 ఏళ్లు. చాలా అందంగా ఉంటుంది. ఆమె చాలా స్ట్రిక్ట్. స్కూల్ టీచర్‌లా కఠినంగా వ్యవహరిస్తుంది. నేనేదైనా తప్పు చేస్తే.. తన క్యాబిన్‌కు పిలిచి చెవులు మెలిపెడుతుంది. చెంప దెబ్బలు కూడా కొడుతోంది. కొత్తలో ఈ విషయమై బాధపడ్డాను. కానీ జాబ్ అవసరం కావడంతో ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. రెండు నెలలుగా ఆమె కొడుతుంటే.. నాకేదో వింత ఫీలింగ్ కలుగుతోంది. కొన్నిసార్లయితే మాటల్లో చెప్పలేని అనుభూతి. నేనేం చేయాలో చెప్పండి. - పేరు రాయలేదు.
Samayam Telugu i get aroused every time my boss slaps me
లేడీ బాస్ కొడుతుంటే.. నాలో ఏదో ఫీలింగ్!


సమాధానం:
డియర్ ఫ్రెండ్, నువ్వు ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నావో అర్థం చేసుకోగలను. ఇది తొలి ఉద్యోగం కాబట్టి అక్కడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నీకు పూర్తిగా అవగాహన రాలేదు. అందంగా ఉన్నవారి పట్ల ఆకర్షణకు లోనుకావడం సహజమే. కానీ తను కొడుతుంటే నువ్వేమో ఏదోలా ఫీలవుతున్నావు. నీ చెంపలు వాయిస్తుంటే ఆమె పట్ల నువ్వు మరింత ఆకర్షణకు గురవుతున్నావు. కానీ ఇది సరికాదు. నీ ఆలోచనల కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎంత కష్టమైనా నిన్ను నువ్వు కంట్రోల్‌లో ఉంచుకోవాలనే సంగతి మర్చిపోకు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది.

ఇక నీ బాస్ విషయానికి వస్తే.. తను నిన్ను కొట్టడం సరైంది కాదు. ఆమె నీ సూపర్ వైజర్ అయినప్పటికీ.. చెవులు పిండటం, చెంపల మీద కొట్టడం ఆమోదయోగ్యం కాదు. ఈ ఉద్యోగం నీకెంతో అవసరమని, దాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేవని అర్థమవుతోంది. కాబట్టి నువ్వు మీ హెచ్‌ఆర్‌తో మాట్లాడు లేదంటే మీ డిపార్ట్‌మెంట్‌లోనే బాగా నమ్మకస్తులైన సీనియర్లతో ఈ విషయం చెప్పు. నీ పరిస్థితి ఏంటో, భవిష్యత్తుల లక్ష్యాలేంటో ఓసారి నిర్ధారణకు రా. నువ్వు బహుశా కెరీర్ ప్రారంభంలోనే ఉండి ఉంటావ్. దీన్నో అనుభవంగా తీసుకొని ఆఫీసు పని ఎలా చక్కబెట్టుకోవాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనే విషయమై అవగాహన పెంచుకో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.