యాప్నగరం

‘నాకు ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్.. నాలుగేళ్లుగా ఆ ఇద్దరితో...’

ఆరేళ్లుగా ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్న యువతి.. అతడితో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే, నాలుగేళ్ల కిందట ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఇప్పుడు ఆమె ఇద్దరినీ వదల్లేకపోతోంది. ఈ సందర్భంగా తన సమస్యను మాకు తెలియజేసింది.

Samayam Telugu 20 Oct 2020, 10:15 pm
సమస్య: నాకు 28 ఏళ్లు. ఆరేళ్ల కిందట ఓ వ్యక్తితో డేటింగ్ చేయడం మొదలుపెట్టాను. అతడు చాలా అద్భుతమైన వ్యక్తి. అయితే, ఏడాదిలోనే అతడి నిజస్వరూపం తెలిసిపోయింది. అతడికి నాతోనే కాకుండా మరికొంతమంది అమ్మాయిలతో సంబంధం ఉందని తెలసింది. ఈ విషయం తెలియగానే అతడు మొదట అంగీకరించలేదు. అతడిని వదిలేయాలని అనుకున్నా. కానీ, అతడు లేకుండా నేను ఉండలేకపోయాను. దీంతో అతడిని క్షమించి డేటింగ్ కొనసాగించాను. అయితే, అదే ఏడాది అతడు తన గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఒకరికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని తెలిసింది. అయితే, అతడు అలాంటిది ఏమీ లేదని చెప్పడంతో క్షమించేశాను. అదే సమయంలో నాకు ఓ న్యాయ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. నేను అతడిని కూడా ప్రేమించడం మొదలుపెట్టాను. అతడు కూడా నన్ను బాగా ప్రేమించాడు. ఏ రోజు నన్ను మోసం చేయలేదు. అతడు చాలా మంచోడు కూడా. అతడితో నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అయితే, నాకు ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో అర్థం కావడం లేదు. నేను ఆరేళ్లుగా ప్రేమిస్తున్న నా మొదటి బాయ్‌ఫ్రెండ్‌ను ఇప్పటికీ ప్రేమిస్తున్నా. మరోవైపు రెండోవాడిని కూడా వదల్లేకపోతున్నా. కానీ, నేను ఇద్దరిలో ఒకరితోనే ఉండాలని అనుకుంటున్నా. నాకు నిజంగా గందరగోళంగా ఉంది. ఏం చేయాలి?
Samayam Telugu Love problems

- ఓ సోదరి (ప్రైవసీ నిమిత్తం పేరును గోప్యంగా ఉంచాం)

Read Also: ‘ఆయనకు పెళ్లయ్యింది.. పిల్లలు ఉన్నారు, కానీ నాతో...’


సలహా: ఇద్దరిలో మీరు ఎవరి వద్ద ఎక్కువ సౌకర్యంగా ఫీలవ్వుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆరేళ్లుగా అతడితో వీడదీయరాని బంధం కొనసాగుతోందని అంటున్నారు. కాబట్టి.. అతనిలో మీకు నచ్చనది ఏమిటో తెలుసుకోండి. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న బాయ్‌ఫ్రెండ్‌కు.. అతడికి మధ్య వత్యాసం.. ఎవరిని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందనేది ఒకసారి ఆలోచించండి. ఇద్దరిలో ఉండే సానుకూల ప్రతికూలతను ఒక పుస్తకంలో నోట్ చేసుకోండి. నాలుగు, ఆరేళ్లలో వారిని మీరు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి.. ఇది మీకు కష్టం కాకపోవచ్చు. పైగా వీరిలో ఎవరితో ఉండాలనేది కచ్చితంగా మీ వ్యక్తిగత నిర్ణయమై ఉండాలి. ఎందుకంటే వారితో భవిష్యత్తులో ప్రయాణించాల్సింది మీరే. పైగా, మీరు వారికి తగిన వ్యక్తా, కాదా అనేది కూడా ఆలోచించుకోండి. అప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లయితే తప్పకుండా స్థానిక కౌన్సిలర్
నుంచి సలహాలు తీసుకోండి.

Read also: ఈ వీర్యుడికి 150 మంది పిల్లలు.. లాక్‌డౌన్‌లో అదే పని, మహిళలతో నేరుగా...

సలహా ఇచ్చినవారు:
డాక్టర్ కేదర్ తిల్వే, సైకియాట్రిస్ట్ & సెక్సాలజిస్ట్, హిరానందానీ హాస్పిటల్, ముంబై

(‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సౌజన్యంతో..)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.