యాప్నగరం

బాయ్‌ఫ్రెండ్ తమ్ముడిపై ఫీలింగ్స్ కలుగుతున్నాయి.. ఏం చేయాలి?

కొద్ది రోజుల క్రితం నా బాయ్‌ఫ్రెండ్ తమ్ముడు నాకు ప్రపోజ్ చేసాడు

TNN 16 Jul 2016, 7:37 pm
ప్రశ్న: నేను నాలుగేళ్ల నుండి ఒకతనితో డేట్ చేస్తున్నాను. కానీ, చదువు సంధ్యలపై సరిగా శ్రద్ధ చూపడం లేదని ఇంట్లోవాళ్లు గట్టిగా మందలించడంతో అతనికి సంవత్సరం పాటు దూరంగా ఉన్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకోలేని నా బాయ్‌ఫ్రెండ్ అభద్రతగా ఫీలయ్యి నాతో చీటికిమాటికి గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే బ్రేకప్ చెప్పేసాను. కానీ, ఈ మధ్యే మళ్లీ మా మధ్య మాటలు మొదలయ్యాయి. కానీ, కొద్ది రోజుల క్రితం నా బాయ్‌ఫ్రెండ్ తమ్ముడు నాకు ప్రపోజ్ చేసాడు. మా ఇద్దరి స్నేహం నా బాయ్‌ప్రెండ్ తమ్ముడికి తెలియదనుకోవడానికి లేదు. అతనికి మా మధ్య జరిగిందంతా చాలా బాగా తెలుసు. అప్పటికి ఒప్పుకోకపోయినా, నాకు ఈ మధ్య ఎందుకో అతనిపై ఫీలింగ్స్ కలుగుతున్నాయి. కానీ, తప్పుచేస్తున్నానా అనే అపరాధభావం నన్ను వెనక్కు లాగుతోంది. ఏం చేయాలో చెప్పగలరు, ప్లీజ్? (ఈ లేఖ రాసిన యువతి పేరు వెల్లడించలేదు)
Samayam Telugu i think i am in love with my boyfriends younger brother
బాయ్‌ఫ్రెండ్ తమ్ముడిపై ఫీలింగ్స్ కలుగుతున్నాయి.. ఏం చేయాలి?



డాక్టర్ దత్తా: మీ మాటలు చూస్తుంటే మీది నిలకడలేని మనస్తత్వంగా అనిపిస్తోంది. ఏ రిలేషన్ షిప్పులో అయినా ఇద్దరి మధ్య కావలసినది నిబద్ధత. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమాభిమానాలు. అది లేని ఏ బంధం మన్నలేదు. మీ ఇద్దరి బంధంలో నెలకొన్న ఒడిదుడుకులు దగ్గర నుండి గమనిస్తున్న అతని తమ్ముడు దీన్ని అవకాశంగా మార్చుకున్నట్లు కూడా అనిపిస్తోంది. మీరు ఇందులో గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీ భావోద్వేగాలు, ఎదుటి వ్యక్తులపై కలిగే తాత్కాలిక ఆకర్షణ లాంటివి మీ జీవితాన్ని కంట్రోల్ చేయనివ్వకండి. మీరు మీ బాయ్‌ఫ్రెండ్ తమ్ముడికి దగ్గరై అన్నకు దూరమవడం అంటే ఆ ఇంట్లో మీరు చిచ్చురేపినట్లే. ఆ కుటుంబంలో కలహాలు, కలతలకు కారణం కాకండి. మీకు మీ బాయ్‌ఫ్రెండ్‌తో ఇష్టం లేకపోతే ఆ కుటుంబానికి చెందని వేరొకరిని చూసుకోండి. ఏ రిలేషన్ షిప్పులో అయినా సందేహాలు, మనస్ఫర్థలు సహజం. ఆరోగ్యమంతమైన బంధానికి నిబద్ధతే పరిష్కారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.