యాప్నగరం

మేము మా భార్యల్ని మార్చుకోవచ్చా..?

నేను పక్కింటి ఆమెతో.. అతను మా ఆవిడతో శారీరకంగా కలిసేలా అందరం ఒక అంగీకారానికి వచ్చాం.

TNN 28 Jun 2017, 10:18 pm
ప్రశ్న: మాది చాలా ఉన్నతమైన కుటుంబం. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఇటీవల మా పక్కింట్లోకి దంపతులు అద్దెకు దిగారు. కొద్దిరోజుల వ్యవధిలోనే వారితో మాకు మంచి అనుబంధం ఏర్పడింది. తొలుత ఒకరికొకరు చెప్పుకోలేదు కానీ.. నలుగురికి ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం ఏర్పడిపోయింది. దీంతో నేను పక్కింటి ఆమెతో.. అతను మా ఆవిడతో శారీరకంగా కలిసేలా అందరం ఒక అంగీకారానికి వచ్చాం. దీనివల్ల ఇరు కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని.. తప్పు చేస్తున్నామనే ఆందోళనకి గురికావాల్సిన అవసరం ఉండదని నా ఆలోచన. కానీ.. భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు వస్తాయా..? దయచేసి సలహా ఇవ్వగలరు- పేరు రాయలేదు.
Samayam Telugu i want to sleep with my neighbours wife and he is okay with it
మేము మా భార్యల్ని మార్చుకోవచ్చా..?


జవాబు: మన దేశంలో భార్యల్ని మార్చుకునే సంస్కృతి లేదు.. సమాజం కూడా ఇలాంటి వాటిని ఆమోదించదు. ఈ వింత ఒప్పందానికి మీ భార్య కూడా అంగీకరించింది అని రాశారు. కానీ.. ప్రతి బంధంలోనూ ఒక హద్దు ఉంటుంది. మిమ్మల్ని మీ భార్య ఎంత ప్రేమిస్తుందో ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకరినొకరు ఇష్టపడి పెద్దలకు చెప్పకుండానే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సహజమే. కానీ.. వివాహమైన తర్వాత కొన్ని పరిమితులను విధించుకుంటారు. అయితే మీ నలుగురుకు ఒకరికొకరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్ మాటేంటి..? ఒకవేళ మీ పక్కింటి దంపతులకి ఏదైనా సమస్య వచ్చి విడిపోతే..? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్థలు వస్తే..? పరిస్థితి ఏంటన్నంది ఒక్కసారి ఆలోచించుకోండి. భవిష్యత్‌లో మీకు పిల్లలు పుడతారు. మీ రెండు కుటుంబాలు చేసే ఈ పనిని వాళ్లు ఏ విధంగా అర్థం చేసుకుంటారు..? మీ కుటుంబాల్లో ఈ విషయం తెలిస్తే వారి ముందు తలెత్తుకోగలరా..? ఇవన్నీ మీరు ఆలోచించిన తర్వాత కూడా.. మేము ఆ వింత ఒప్పందానికే కట్టుబడి ఉంటాము అనుకుంటే.. కనీసం సేప్టీని ఉపయోగించడం మరిచిపోకండి.

సలహా ఇచ్చిన వారు డాక్టర్ రోహన, సైక్రియాట్రి, ముంబయి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.