యాప్నగరం

‘నా గుండె పగిలింది.. ఇక ఒంటరిగా ఉంటా.. కానీ, నా తల్లిదండ్రులు..’

గతంలో ఆమెకు ఎదురైన సమస్యలు.. ప్రేమ, పెళ్లిళ్లపై విరక్తి కలిగించింది. జీవితాంతం ఒంటరిగానే జీవించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి.. ఒప్పించడం ఎలా అంటూ తన సమస్యను వివరించింది.

Samayam Telugu 13 Apr 2021, 8:22 pm
సమస్య: నాకు 29 ఏళ్లు. ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయడం కోసం అబ్బాయిని వెతుకుతున్నారు. కానీ, నాకు 20 ఏళ్ల వయస్సులోనే పలుసార్లు గుండె పగిలింది. అప్పటి నుంచి నేను ఎవరినీ ప్రేమించకూడదని, పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని అనుకుంటున్నా. ఈ నిర్ణయంపై నేను చాలా నమ్మకంతో ఉన్నా. ఈ విషయం చెబితే నా తల్లిదండ్రు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నేను వారిని ఎలా ఒప్పించాలి? దయచేసి సలహా ఇవ్వగలరు.
Samayam Telugu Relationships Problems

- ఓ సోదరి (ప్రైవసీ నిమిత్తం పేరు గోప్యంగా ఉంచాం)

సమాధానం: ఏదో ఒక వయస్సులో గుండె పగిలే ఘటనలు ఎదురు కావడం జీవితంలో సాధారణమే. అది చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు చెప్పిన విషయాన్ని చదువుతుంటే మీరు పలుసార్లు ప్రేమలో విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం టీనేజ్‌ లేదా 20 ఏళ్ల వయస్సులో తీసుకొనే నిర్ణయాల్లో చాలావరకు పరిపక్వత లేకుండా ఉంటాయి. ఆ సమయంలో కలిగే మోహం, ఆకర్షణను ప్రేమ అనుకుంటాం. అయితే, ఆ వయస్సులో గుండె పగిలితే ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోగలం.

Read Also: ‘నాకు పెళ్లయ్యింది.. కానీ, బలహీన క్షణంలో నా బావతో...’

అయితే, ప్రపంచంలో అంతా ఒకేలా ఉండరు. కాబట్టి.. మరొకరితో బంధాన్ని ఏర్పరుచుకోడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పటికీ మీకు పెళ్లి చేసుకోవాలనే భావిస్తుంటే.. మీ తల్లిదండ్రులతో కూర్చొని మనసులో మాట నిర్భయంగా చెప్పేయండి. ఇదివరకు ఏర్పడిన చేదు అనుభవాలను వారికి చెప్పి చూడండి. వారు మీ సమస్యను అర్థం చేసుకోవడమే కాకుండా తగిన మార్గాన్ని అన్వేషిస్తారు. మీలో ధైర్యాన్ని నింపుతారు.
‘నా బెస్ట్‌ఫ్రెండ్ సవతిలా మారింది.. రాత్రిళ్లు నా ప్రియుడితో..’తల్లిదండ్రులతో గత రిలేషన్‌షిప్స్ గురించి షేర్ చేసుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకోగలం. కానీ, కొన్ని విషయాలను మనసులో పెట్టుకోకుండా చెప్పేస్తేనే మనస్పర్థలు ఉండవు. పెద్దలకు కూడా ఒక స్పష్టత వస్తుంది. మీరు చెప్పే విషయం వారిని బాధించవచ్చు. అయితే, వారు మీ సమస్యను అర్థం చేసుకుని మీ వైపు నుంచి కూడా ఆలోచించడం మొదలుపెడతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.