యాప్నగరం

పెళ్లయ్యింది కానీ.. ఎఫ్‌బీలో పరిచయమైన వ్యక్తితో

ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. బహుశా నేనిప్పుడు అతణ్ని ప్రేమిస్తున్నానేమో. నా వివాహ బంధం విషయానికి వస్తే..

TNN 13 Mar 2017, 5:14 pm
ప్రశ్న: నాకు 38 ఏళ్లు, చాలా ఏళ్ల కిందటే పెళ్లయ్యింది. ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. బహుశా నేనిప్పుడు అతణ్ని ప్రేమిస్తున్నానేమో. నా వివాహ బంధం విషయానికి వస్తే.. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆయనతో ఎలాంటి సమస్యలు లేవు. తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ ఫేస్‌బుక్ ద్వారా నాకు పరిచయమైన వ్యక్తి పూర్తిగా డిఫరెంట్. అతడంటే నాకెంతో ఇష్టం ఏర్పడింది. ఒక్క రోజు తను నాతో మాట్లాడకపోయినా పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది. మూడు నెలల కిందట అతణ్ని ముద్దాడాను. అది కూడా ఒకసారి మాత్రమే. కానీ ఇప్పటికీ ఆ క్షణాల్ని మర్చిపోలేకపోతున్నా. 18 ఏళ్ల వైవాహిక జీవితంలో నాకెప్పుడూ అలా అనిపించలేదు.
Samayam Telugu im having an extramarital affair on facebook
పెళ్లయ్యింది కానీ.. ఎఫ్‌బీలో పరిచయమైన వ్యక్తితో


నేను సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. దీంతో పెళ్లికి ముందు మగాళ్లతో మాట్లాడటానికి గానీ, ప్రేమించడానికి కానీ వీల్లేకపోయింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి నా జీవితంలో నాకే తెలియని కొత్తదనాన్ని పరిచయం చేశాడు. అతడితో ఎఫ్‌బీలో చేసిన చాటింగ్‌ను చూసుకుంటూ.. జరిగిందంతా గుర్తుకు చేసుకుంటూ ఉంటాను. కానీ నా భర్తను బాధపెట్టాలని లేదు. కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టలేను. నా స్వార్థం కూడా మా ఆయన్ను వదిలిపెట్టలేను. కానీ ఆ వ్యక్తి పట్ల నా ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేనిప్పుడు కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. ఏం చేయాలో చెప్పండి. - పేరు రాయలేదు.


సమాధానం: నేను మీ మనసును బాధపెట్టాలని అనుకోవడం లేదుగానీ.. కనిపించేదంత వాస్తవం కాదు. అలాగే దూరం నుంచి కనిపించే కొండలు నునుపుగా కనిపించినంత మాత్రాన అది నిజం కాదు. మీలాగే చాలా మంది సోషల్ మీడియాలో పరిచయమైన వారి ప్రేమ కోసం వెంపర్లాడుతుండటాన్ని నేను గమనించాను. కాకపోతే వారు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తుంటారు. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. మీ వివాహ బంధాన్ని పటిష్టం చేసుకొండి. మీ ఆయన పట్ల ప్రేమతో ఉండండి. మీరు ఇంత వరకూ వేరే వ్యక్తులతో పెద్దగా మాట్లాడి ఉండకపోవడంతో.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. మీరు బోర్‌గా ఫీలవడం కూడా మరో కారణం కావచ్చు. వివాహ బంధానికి అడ్డు వచ్చే బంధాలను వదులుకోవడం వల్ల మీ జీవితం ప్రశాతంగా సాగుతుంది. కాబట్టి అతణ్ని మర్చిపోండి.

సమాధానం ఇచ్చినవారు: Dr Seema Hingorrany, Clinical Psychologist

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.