యాప్నగరం

నా భార్యతో నా ఫ్రెండ్ రహస్యంగా.. వాళ్లను ఆపేదెలా? ఏం చేయాలి?

తన స్నేహితుడు తన భార్యతో సీక్రెట్‌గా మాట్లాడుతున్నాడు. తన వ్యక్తిగత విషయాలను తన భార్యతో పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా భర్త తన సమస్యను ఇలా వివరించాడు.

Samayam Telugu 5 Oct 2020, 9:11 pm
సమస్య: నా భార్య నా స్నేహితులతో ఎంతో క్లోజ్‌గా మెలుగుతుంది. నా స్నేహితులను తన స్నేహితులుగానే భావిస్తుంది. ఇటీవల నాకు ఓ విషయం తెలిసింది. నా స్నేహితుల్లో ఒకరు నా భార్యతో క్లోజ్‌గా ఉంటున్నాడు. నా భార్యతో రహస్యంగా మాట్లాడుతున్నాడు. తన పెళ్లికి సంబంధించిన కొన్ని పర్శనల్ విషయాలను నా భార్యకు చెప్పి సలహాలు తీసుకుంటున్నాడు. దీనిపై నేను అతిగా స్పందించాలని అనుకోవడం లేదు. కానీ, వాళ్లు అలా మాట్లాడుకోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. వాళ్లు మాట్లాడుకోవడం మానేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. వాళ్లు అలా రహస్యంగా మాట్లాడుకోవడాన్ని ఆపేదెలా? దీనిపై సలహా ఇవ్వగలరు.
Samayam Telugu నా భార్యతో నా ఫ్రెండ్ రహస్యంగా...


డాక్టర్ రచనా సింగ్ సలహా: మీ సమస్య నాకు అర్థమైంది. మీ స్నేహితుడు మీ కంటే.. మీ భార్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, తన పర్శనల్ విషయాలను ఆమె చెప్పుకోవడం మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది. మీ స్థానంలో ఎవరు ఉన్నా.. అలాగే అనిపిస్తుంది. అయితే, స్నేహితులు తమ మిత్రులను సలహాలు సూచనలు తీసుకోవడం సహజమే.

Read Also: నా భర్త ఫ్రెండ్.. నాతో అలా, ఏం చేయాలి?

మీరు మీ ఫ్రెండ్ కోణంలో ఆలోచించి చూడండి. అతడి తన పర్శనల్ విషయాలను వేరే వ్యక్తులతో చెప్పుకోడానికి అసౌకర్యంగా భావిస్తున్నాడు కాబోలు. అతడు మిమ్మల్ని, మీ భార్యను మంచి స్నేహితుడిగా భావిస్తున్న కారణంతోనే తన సమస్యలను చెప్పుకుంటున్నాడేమో. మీ భార్యతో అతడు మంచి సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. కాబట్టి.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Read Also: అబ్బాయిలూ.. కండోమ్‌లతో జాగ్రత్త, ఇలాగైతే.. ‘అది’ వాచిపోతుంది!

ఈ విషయాన్ని మీరు మనసులోనే పెట్టుకుని కుమిలి పోవాల్సిన అవసరం లేదు. మీ భార్యతో దీని గురించి మాట్లాడితే సమస్య తీరిపోతుంది. ఫలితంగా ఆమె మీ ఇబ్బందిని అర్థం చేసుకోవడమే కాకుండా మీకు నచ్చిన విధంగా ఉండవచ్చు. ఆమె మీ అభద్రతను కూడా దూరం చేయొచ్చు. వారి మధ్య జరుగుతున్న చర్చను మీకు కూడా తెలిసేలా ఉండాలని చెప్పండి. ఒక వేళ మీ స్నేహితుడిలో ఏమైనా చెడ్డ ఆలోచనలు ఉన్నా, ఉద్దేశపూర్వకంగానే మాటలతో కలుపుతున్నా.. ఆ విషయాన్ని మీ భార్యకు చెప్పండి. ఫలితంగా ఆమె విషయాన్ని అర్థం చేసుకుని మీకు సహకరించవచ్చు.

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో..)

Dr.రచనా ఖన్నన్ సింగ్,
హోలిస్టిక్ మెడిసిన్, అర్టెమిస్ హాస్పిటల్, గుర్గావ్,
రిలేషన్‌షిప్, లైఫ్‌స్టైల్ అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.