యాప్నగరం

గర్ల్ ఫ్రెండ్ తిడుతోంది... కొడుతోంది కూడా...!

గర్ల్ ఫ్రెండ్ చేత తిట్లు, దెబ్బలు తింటున్న ఓ ప్రేమికుడి సమస్య...

TNN 27 May 2017, 3:11 pm
నా వయసు 35 సంవత్సరాలు. భార్యతో విడిపోయా. రెండేళ్ల నుంచి ఒకమ్మాయిని ప్రేమిస్తున్నా. ఆమె వయసు 25 ఏళ్లు. ఇద్దరం కలిసే ఉంటున్నాం. ఆమె చాలా ప్రేమగా చూసుకుంటోంది. తనంటే నాకు చాలా ఇష్టం. రెండేళ్లు మా మధ్య బంధం ఉంది. కొన్ని నెలల నుంచి మాత్రం తను చాలా వింతగా ప్రవర్తిస్తోంది. నా మీద విపరీతంగా కోప్పడుతోంది. ఒక్కోసారి చేయి చేసుకుంటోంది. కాస్త కూడా మర్యాద ఇవ్వకుండా బూతులు తిడుతోంది. ఆ తిట్లు వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలా చెడు పదాలు వాడుతుంది. కొన్ని నెలలుగా ఆ మాటలు, తిట్లు పడుతూ... నా మీదే నాకు అసహ్యం వేస్తోంది. అయితే కోపం వచ్చినప్పుడే ఇలా ప్రవర్తిస్తోంది. లేకుంటే మాత్రం నన్ను బాగా చూసుకుంటోంది. అంతవరకు బాగానే ఉంటుంది... కొన్ని సెకన్లలోనే మూడ్ మారిపోతోంది. ఆమె ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు. మా పెళ్లిపైనా కూడా ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె వింత ప్రవర్తనతో పెళ్లంటేనే భయం వేస్తోంది. నాకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం. ఏం చేయాలో తెలియడం లేదు. మంచి సలహా ఇవ్వండి.
Samayam Telugu my girlfriend abuses me verbally physically
గర్ల్ ఫ్రెండ్ తిడుతోంది... కొడుతోంది కూడా...!


- ఓ సోదరుడు

డాక్టర్ అవత్రామణి:
నాకు మీ పరిస్థితి అర్థమైంది. మీ గర్ల్ ఫ్రెండ్ ప్రవర్తన మిమ్మల్ని బాగా బాధపెడుతోంది... అలాగని ఆమెను వదిలి మీరు ఉండలేరు. అయితే ఆమె ప్రవర్తన ఆమెకే తెలిసేలా ముందు మీరు వివరించాలి. ఒక ప్రశాంత వాతావరణంలో ఆమెను కూర్చోబెట్టి... ఆమె మాటలు, చేతల వల్ల మీరు ఎంతగా బాదపడుతున్నారో చెప్పండి. అదే సమయంలో ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో కూడా వివరించండి. ఇంతలా బూతులు తిడుతున్నా, చెంపలు వాయిస్తున్నా కూడా ఆమె దగ్గరే మీరు ఎందుకు ఉంటున్నారో చెప్పండి. ఆమె మూడ్ సెకన్లలో ఎందుకు మారిపోతోందో కనుక్కోండి. రిలేషన్ షిప్ కౌన్సిలర్ ని కలిసినా కూడా మంచిదే. మానసికంగా బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఇలా కోపం అతి త్వరగా వచ్చేస్తుంది. కనుక అవసరమైతే ఆమెను సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లడం కూడా ఉత్తమమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.