యాప్నగరం

ఐదేళ్లుగా సహజీవనం.. సెక్స్‌ ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే..

ఐదేళ్లుగా సహ జీవనం చేస్తున్న ఓ యువ జంటకు ఎదురైన సమస్య ఇది. ఇంతకీ వీరు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు? నిపుణులు ఇచ్చిన సూచనలేమిటీ?

Samayam Telugu 22 Sep 2020, 11:27 pm
సమస్య: నాకు 22 ఏళ్లు. నేను, నా గర్ల్‌ఫ్రెండ్ గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాం. ఒక వైపు చదువుకుంటూ పనిచేస్తుండటం వల్ల మా ఇద్దరిపై చాలా ఒత్తిడి ఉంది. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నామనే సంతోషమే గానీ.. సెక్స్‌ను మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అప్పుడప్పుడు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నాం. మా మధ్య రొమాన్స్ దాదాపు లేదు. ఇక సంతోషం అస్సలు లేదు. ఈ సమస్య నుంచి బయటపడి.. మళ్లీ సంతోషంగా జీవించే మార్గం ఉంటే సూచించగలరు.
Samayam Telugu ఐదేళ్లుగా సహజీవనం.. సెక్స్‌ ఎంజాయ్ చేయలేకపోతున్నాం


నిపుణుల సూచన: పెళ్లయ్యి.. పెద్దవాళ్లు ఎదుర్కొనే సమస్యలను మీరు చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఎదుర్కొనే సమస్యలు శృంగారంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని మీకు అప్పుడే అనుభవంలోకి వచ్చింది. ఒత్తిడి వల్ల లైంగిక వాంఛలు దెబ్బతింటాయి. దీని వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి.. ముందుగా ఒత్తిడిని ఎదురించే మార్గాలను అన్వేషించండి. ముందుగా చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టండి. అది కేవలం మీరిద్దరు కలిసి మాత్రమే చేయగలరు.

Read Also: డేంజర్ స్ట్రోక్.. పక్షవాతంతో జాగ్రత్త! ఈ లక్షణాలుంటే అప్రమత్తంగా ఉండండి

ఈ నేపథ్యంలో మీరు నిరాశని పక్కన పెట్టండి. ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోండి. ఆమెపై మీకు ఎంత ప్రేమ వుందనేది మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పండి. అలాగే ఆమెలో ఉన్న నిరాశను దూరం చేయడానికి కూడా ప్రయత్నించండి. ఆమె మీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. శృంగారపరంగా ఏమైనా సమస్యలున్నా అడిగి తెలుసుకోండి. ఆమెకు మంచి భాగస్వామిగా ఉండటానికి ఏం చేయాలో అడగండి. అప్పుడే మీరు ఎప్పటిలా లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ బాంధవ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read Also: మొలలు లేదా పైల్స్.. ఎలా వస్తాయి? లక్షణాలేమిటీ?

(ఈ సలహా ఇచ్చిన వారు డాక్టర్ పమేలా స్టీఫెన్సన్, సైకోథెరపిస్ట్)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.