యాప్నగరం

నా గర్ల్‌ఫ్రెండ్ గతం నన్ను బాధిస్తోంది!

గత ఎనిమిది నెలలుగా ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కొద్ది రోజుల క్రితం వరకూ మా ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉండేది.

TNN 25 May 2017, 8:01 pm
ప్రశ్న: గత ఎనిమిది నెలలుగా ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కొద్ది రోజుల క్రితం వరకూ మా ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉండేది. నేను తనను ఎంతగానో ప్రేమించాను. తన మీద పూర్తి నమ్మకం ఉండేది. మా గతాల గురించి కూడా ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఇద్దరం శారీరకంగానూ దగ్గరయ్యాం. గతంలో మాజీ లవర్‌తో సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని మేం ఇద్దరం ఒక్కటయ్యాక తను చెప్పింది. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచి తనతో కలిసి ఉండలేకపోతున్నా. తన గతం నుంచి నాకు మిశ్రమ అనుభూతులు కలుగుతున్నాయి. తను నాతో చెప్పిన విషయాన్ని మర్చిపోలేకపోతున్నా. అదే సమయంలో తనను మర్చిపోలేకపోతున్నా. ఆ అమ్మాయి అంటే నాకెంతో ఇష్టం. ఈ ఆలోచనల వల్ల తనకు దూరం కావాలని అనుకోవడం లేదు. నేనేం చేయాలో సలహా ఇవ్వగలరు. - పేరు రాయలేదు.
Samayam Telugu my girlfriends sexual past is bothering me
నా గర్ల్‌ఫ్రెండ్ గతం నన్ను బాధిస్తోంది!


సమాధానం: మిమల్ని ఆనందంగా ఉంచే ఓ వ్యక్తిని పొందడం నిజంగా అదృష్టం. అనుబంధం ఎక్కువ కాలం నిలబడాలంటే ఇద్దరి మధ్య
నమ్మకం ఉండాలి. శారీరక కలయిక అనేది సాధారణ విషయమే. అసలు జరిగిన దానికంటే కొన్నిసార్లు అనుమానం వల్లే అనుబంధాలు ఎక్కువగా దెబ్బతింటాయి. తను ఇప్పటికే గతం గురించి మీతో చెప్పేసింది. కాబట్టి తనతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. తన భావాలను గౌరవించండి. తద్వారా మీరు తనను మరింతగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటికీ మీరు ఇబ్బందిగానే ఉంటే.. మానసిక నిపుణ్ని సంప్రదించండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.