యాప్నగరం

‘తొలిరాత్రి అలా కాలేదని.. నా భర్త అనుమానిస్తున్నాడు’

ప్రతి పురుషుడు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఇది. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మనసులో లేనిపోని ఆందోళనలు పెట్టుకుంటున్నారు. కాబట్టి.. ఈ విషయం గురించి వివరంగా తెలుసుకోండి.

Samayam Telugu 11 Feb 2021, 8:22 pm
సమస్య: నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే, తొలిరాత్రే నాకు ఇబ్బందికరమైన అనుభవం ఎదురైంది. తొలి కలయికలో నాకు బ్లీడింగ్ కాలేదు. నేను ఇదివరకు ఎవరితోనూ లైంగిక కలవలేదు. అదే తొలిసారి. కానీ, నా భర్త పెళ్లికి ముందే నాకు వేరే వ్యక్తితో శరీరక సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు. అప్పటికీ నేను ఈ విషయం మీద స్పష్టత ఇచ్చాను. కొందరు యువతల్లో పలు కారణాల వల్ల హైమెన్ (సన్నని పొర) ఛిద్రమయ్యే అవకాశం ఉందని ఆయనకి వివరించి చెప్పాను. ఇది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ అని, నా విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చని తెలిపాను. కానీ, ఆయనకు అర్థం కావడం లేదు. పెళ్లికి ముందు నాకు ఏ సంబంధం లేదని ఎలా చెప్పాలి?
Samayam Telugu Wedding Night Problems

- ఓ సోదరి (ప్రైవసీ నిమిత్తం పేరు గోప్యంగా ఉంచాం)

సమాధానం: మహిళ రహస్యాంగం ఆరంభంలో ఉండే ఆ పొర చాలా పలచగా ఉంటుంది. చాలామంది దాన్ని లైంగిక చర్యలకు ముడిపెడుతున్నారు. తొలిసారి శరీరకంగా కలిసినప్పుడే అది చిట్లి.. బ్లీడింగ్ వస్తుందని నమ్ముతున్నారు. అది చాలా తప్పు. అది చాలామందిలో వివిధ శరీరక సమస్యల వల్ల ముందే చిధ్రమవుతుంది. ఇక కలయిక విషయానికి వస్తే.. కొంతమంది మహిళల రహస్యాంగంలో లూబ్రికేషన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల వారికి రక్తం వస్తుంది. అంతేగానీ.. ఆ పొర చిట్లడం వల్ల కాదు. కొందరిలో ఆ పొర సాగి ఉంటుంది. కాబట్టి.. తొలి కలయికలో అది పగిలే అవకాశాలు తక్కువ. మీ భర్తకు దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడం వల్లే ఇలా అనుమానిస్తున్నాడు. కొంతమంది ఆడపిల్లలు ఆ పొర లేకుండానే జన్మిస్తున్నారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా సరే ఆ పొర చిట్లిపోతుంది. ముఖ్యంగా పరుగులు పెట్టడం, సైకిలింగ్ చేయడం, ఇతరాత్ర ఆటల్లో అలా జరుగుతుంది. కొందరిలో స్వయంతృప్తి వల్ల కూడా అలా జరుగుతుంది. దీనిపై మరోసారి మీ భర్తకు సవివరంగా చెప్పండి. లేదా వైద్యులు లేదా, కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్లి.. వారితోనే ఆ విషయం చెప్పించండి.
‘నాకు నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌.. వారితో అన్నీ అయిపోయాయి.. కానీ, పెళ్లికి...’సలహా ఇచ్చినవారు: రచనా అవత్రామణి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ముంబయి

(సేకరణ: టైమ్స్ ఆఫ్ ఇండియా/లైఫ్‌స్టైల్ - ఆస్క్ ది ఎక్స్‌పర్ట్)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.