యాప్నగరం

Love Capsule : అన్నా చెల్లెళ్ళు అలా చేయడం కరెక్టేనా..

Expert Solutions: చాలా మంది ఇళ్ళల్లో సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. వివాహాలు అయ్యాక వీటి వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు కూడా వస్తాయి. ఇదే నేపథ్యంలో ఓ మహిళ తన భర్తతో ఆడపడుచు చాలా క్లోజ్‌గా ఉంటోందని బాధపడుతోంది. దీనికి తమ మధ్య ఎలాంటి తప్పులు లేవంటూ భర్త ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ ఇద్దరి సమస్యలు విన్నాక నిపుణులు ఏం ఆలోచించారు. వారిద్దరికీ ఏ సలహా ఇచ్చారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.

Authored byరావుల అమల | Samayam Telugu 12 Jul 2022, 10:58 pm

ప్రధానాంశాలు:

  • భర్తతో క్లోజ్‌గా ఉన్న ఆడపడుచు
  • ఇబ్బందిగా ఫీల్ అవుతున్న మహిళ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu భార్యభర్తల మధ్య ఆడపడుచుతో గొడవ
మహిళ ప్రశ్న :
Expert Solutions: హాయ్ మేడమ్.. నా భర్త, ఆడపడుచు అసభ్యంగా ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు. నేను చూసినప్పుడు నా ఆడపడుచు నా భర్త పైనే కూర్చుంది. ఆడపడుచు వయసు 20 ఏళ్ళు. కాలేజ్‌లో చదువుతుంది. నా భర్తకి 28 సంవత్సరాలు. వారిద్దరూ అలా కూర్చుని మూవీ చూస్తున్నారు. ఏంటని నేను అడిగితే ఇద్దరు నాదే తప్పన్నట్లుగా చూశారు. వారికి అది తప్పుగా అనిపించలేదు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించిది. ఇది మా అత్తమామలతో కూడా ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను నా భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తను విసుక్కుంటున్నాడు. దీనిని సాల్వ్ చేసేందుకు ఏం చేయాలి.
ఈ విటమిన్ల లోపంతో నరాలు దెబ్బతిని బ్రెయిన్ పనిచేయదట..
అతని సమస్య :

నా చెల్లెలు, నేను చాలా క్లోజ్‌గా ఉన్నాం. మా ఇద్దరి మధ్య పర్సనల్ జోక్స్ ఉంటాయి. నా చెల్లి ఒడిలో కూర్చుంది. ఎందుకంటే తను చిన్నపిల్లే. అప్పుడు మేము ఇంగ్లీష్ మూవీ చూస్తున్నాం. నా భార్యకి అది అసహ్యంగా అనిపించింది. అరిచింది. ఎందుకు అలా చేస్తుందో నాకు తెలియడం లేదు.

రిలేషన్‌షిప్ కోచ్ :


రిలేషన్‌షిప్స్ ఎప్పుడు కూడా సున్నితంగానే ఉంటాయి. స్త్రీ, పురుషులు దీని అర్థం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి మీరు మీ భార్యను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆమెతో కూర్చుని మాట్లాడండి. మన సమాజంలో స్త్రీలపై అత్యాచారం చేసే మగవారిలో చాలా మంది రక్త సంబంధం వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆమె ఆలోచన అలా కూడా ఉండొచ్చు. మీరు కరెక్ట్‌గా ఉంటే తనతో కూర్చుని అన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ప్రేమతో చెప్తే తనకి అర్థమవుతుంది.

Weight Loss : వీటిని తింటే బరువు తగ్గుతారట..

మరో ఎక్స్‌పర్ట్ :

ప్రతి ఇంట్లోనూ ఆలోచనా విధానాలు వేరుగా ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఐ లవ్ యూ అని చెప్పుకోవడం, హగ్ చేసుకోవడం అనేది ప్రేమను వ్యక్తపరిచే ఓ సాధారణ మార్గం. మరి కొన్ని కుటుంబాలలో ఓ నిర్ధిష్టమైన పరిధులు ఉంటాయి. ఏ ఫీలింగ్‌నైనా ఎక్స్‌ప్రెస్ చేసేందుకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని మీరు అర్తం చేసుకోవాలి. భార్యా, భర్తలు ఒకరిపై ఒకరు అరుచుకోవడం కంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం ఉత్తమం. మీ చెల్లెలు పెరుగుతోంది. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ నాకు తెలుసుకు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా.. ఎందుకంటే ఆమెకు సమాజంలో ఎలాంటి ఇబ్బంది కలగుండా ఉండాలంటే మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలని భార్య భర్తకి చెప్పాలి. ఇలా చెప్పడం ద్వారా అభ్యంతరంగా ఉండదు.
Glass skin : గ్లాస్ స్కిన్ కావాలా.. ఇలా చేయండి..
ఒక్కటి గుర్తుంచుకోండి. మన కళ్ళు చూసేవన్నీ నిజాలు కావు. కాబట్టి కూర్చుని మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. ఆల్ ది బెస్ట్..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.